Site icon NTV Telugu

స‌ర్కార్ సంచ‌ల‌న నిర్ణ‌యం..! పొల్యూష‌న్ సర్టిఫికేట్ ఉంటేనే పెట్రోల్..!

ప్ర‌తీరోజు ల‌క్ష‌లాది మంది రోడ్ల‌పైకి వ‌స్తున్నాయి.. కార్లు, బైక్‌లు, ఇత‌ర వాహ‌నాల నుంచి వెలువ‌డే కాలుష్యానికి తోడు ప‌రిశ్ర‌మ‌ల నుంచి వెలువ‌డే కాలుష్యంతో వాయు కాలుష్యం ప్రపంచమంతటా పెరిగిపోతుంది. కాలుష్యానికి దూరంగా ఉన్న ప్రాంతాలు సైతం క్ర‌మంగా దాని బారిన‌ప‌డిపోతున్నాయి.. దీంతో.. దిద్దుబాటు చ‌ర్య‌లు చేప‌డుతున్నాయి ప్ర‌భుత్వాలు.. ఇప్ప‌టికే వాయుకాలుష్యం ప్రమాదకర స్థాయిలో ఉండే ఢిల్లీలో.. నియంత్ర‌ణ కోసం కొన్ని చ‌ర్య‌ల‌కు పూనుకుంది ఆమ్ఆద్మీ స‌ర్కార్.. ఇప్పుడు మ‌రింత క‌ఠిన నిర్ణ‌యాల‌ను పూనుకుంటుంది.. దానిలో భాగంగా.. పొల్యుషన్‌ అండర్‌ చెక్‌ సర్టిఫికేట్‌ (పీయూసీసీ) ఉన్న వాహనాలకే మాత్ర‌మే.. పెట్రోల్ బంకుల్లో పెట్రోల్‌, డీజిల్ పోసేందుకు అనుమ‌తి ఇచ్చేలా కొత్త చట్టం తెచ్చే యోచనలో ఉన్నట్టు ఢిల్లీ పర్యావరణశాఖ మంత్రి గోపాల్‌రాయ్ వెల్ల‌డించారు.

Read Also: తెలంగాణ‌లోనూ స్వ‌ల్పంగా త‌గ్గిన కోవిడ్ కేసులు

పెట్రోల్‌, డీజిల్ కోసం బంకుల్లోకి వచ్చే వాహనదారులు తప్పని సరిగా పొల్యుషన్‌ సర్టిఫికేట్‌ తమతో పాటు తెచ్చుకోవాల్సి ఉంటుంది.. లేదా ఆయా పెట్రోల్ బంకుల్లో ఉండే పొల్యుషన్‌ టెస్టింగ్‌ కేంద్రాల దగ్గర‌నైనా ఆ సర్టిఫికేట్‌ పొందాల్సి ఉంటుంద‌ని గోపాల్‌రాయ్ తెలిపారు.. ఒకవేళ పొల్యుష‌న్ స‌ర్టిఫికెట్ లేక‌పోతే పెట్రోల్‌ లేదా డీజిల్ పోసుకునే అవ‌కాశ‌మే లేకుండా చేయ‌బోతున్నారు.. మ‌రోవైపు, ఈ విధానం అమ‌లు చేస్తే వ‌చ్చే ఇబ్బందులు.. లోటపాట్లు, ఇతర మార్పు చేర్పులపై నిపుణులు, వివిధ వర్గాల ప్రజల నుంచి కూడా అభిప్రాయాలు సేక‌రించే ప‌నిలోప‌డిపోయింది ఢిల్లీ ప్ర‌భుత్వం.

Exit mobile version