NTV Telugu Site icon

Delhi: ఆ కేంద్రపాలిత ప్రాంతంలో పెట్రోల్ బైకులు, సీఎన్‌జీ ఆటోలు బ్యాన్..?

Delhi

Delhi

Delhi: దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం విపరీతంగా పెరిగుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని అక్కడి సర్కార్ కీలకమైన నిర్ణయం తీసుకుంది. త్వరలోనే ‘ఈవీ పాలసీ 2.0’ను అమలుచేసేందుకు రెడీ అవుతుంది. దీనికి కేబినెట్ నుంచి ఆమోదం లభించిన తర్వాత.. పెట్రోల్, డీజిల్ సీఎన్‌జీ వెహికిల్స్ ను పూర్తిస్థాయిలో నిషేధించడానికి ఢిల్లీ ప్రభుత్వం అడుగులు వేస్తుంది. ఈవీ పాలసీ 2.0 అమలులోకి వచ్చిన తర్వాత.. వచ్చే సంవత్సరం నుంచే పెట్రోల్, డీజీల్, సీఎన్జీ వాహనాలపై బ్యాన్ విధించే అవకాశం ఉంది. 2027 డిసెంబర్ 31 నాటికి ఢిల్లీలో వందశాతం ఎలక్ట్రిక్ వాహనాలను నడపాలనే ఉద్దేశ్యంతోనే.. బీజేపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. సీఎన్జీ బైకులు, ఆటోలను కూడా నిషేదించనున్నట్లు టాక్. ఫ్యూయెల్ కార్లను ఎంత వరకు నిషేధిస్తారు అనే దానికి సంబంధించిన వివరాలు అధికారికంగా వెల్లడి కాలేదు.

Read Also: Siddu Jonnalagadda : ‘జాక్’ ఓవర్శీస్ టాక్

ఇక, 2025 ఆగస్టు 15 నుంచి ఢిల్లీలో కొత్త సీఎన్‌జీ ఆటో రిక్షా రిజిస్ట్రేషన్లను, రెన్యువల్స్ అనుమతించబోమని ఇప్పటికే తెలిపారు. కేవలం ఎలక్ట్రిక్ ఆటోల రెన్యువల్స్, రిజిస్ట్రేషన్లకు మాత్రమే అనుమతి లభించనుంది. ఆ తరువాత దశల వారీగా పెట్రోల్, డీజిల్, సీఎన్‌జీ వాహనాలను తొలగించనున్నారు. వీటి స్థానంలో కొత్తగా ఎలక్ట్రిక్ వాహనాలను ఉపయోగించాల్సి ఉంటుంది. కాగా, బైకులు, ఆటోలు మాత్రమే కాకుండా.. ఢిల్లీలో చెత్తను సేకరించే వాహనాలు, సిటీ బస్సులు కూడా ఎలక్ట్రిక్ వాహనాలుగా అప్ గ్రేడ్ చేయాలని పేర్కొన్నారు. ఇక, మార్చి 31వ తేదీతో ముగిసిన ‘ఈవీ పాలసీ’ని ఢిల్లీ సర్కార్ మరో 15 రోజులు పొడిగించింది. ఆ తరువాత ఈవీ పాలసీ 2.0 అమలులోకి తీసుకు రానుంది. ఫ్యూయెల్ వెహికిల్స్.. ఎలక్ట్రిక్ వాహనాలతో భర్తీ చేయడమే ఈ కొత్త పాలసీ టార్గెట్ అని అధికారులు తెలియజేస్తున్నారు.