దేశ రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. అంతేకాకుండా భారీగానే పోలింగ్ నమోదైంది. ఉదయం నుంచి ఓటర్లు పోటెత్తారు. ఇక పోలింగ్ అనంతరం ఎగ్జిట్ పోల్స్ కూడా వచ్చేశాయి. అయితే ఈసారి అధికారం మాత్రం కమలానిదేనని సర్వేలు తేల్చేశాయి. జాతీయ మీడియా సర్వేలన్నీ బీజేపీకే పట్టం కట్టాయి. మొదటి స్థానంలో బీజేపీ, రెండో స్థానంలో ఆప్, మూడో స్థానంలో కాంగ్రెస్ ఉంటుందని తెలిపాయి. కాంగ్రెస్ పూర్తిగా తుడుచుకు పెట్టుకుపోతుందని తెలిపాయి.
ఇది కూడా చదవండి: Minister Nara Lokesh: విశాఖ స్టీల్ ప్లాంట్‌పై ఇంకా అనుమానాలు ఎందుకు..? త్వరలోనే ప్రధానితో భేటీ..
తాజాగా సర్వేలపై ఆప్ స్పందించింది. సర్వేలను ఆమ్ ఆద్మీ పార్టీ కొట్టిపారేసింది. ఢిల్లీలో ఆప్‌కు ఇది నాలుగో ఎన్నిక అని.. ప్రతిసారీ ఎగ్జిట్ పోల్స్‌లో ఆప్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం లేదని చెప్పుకొచ్చాయని.. మరోసారి ఇప్పుడు కూడా అలానే చెబుతున్నాయని సుశీల్ గుప్తా పేర్కొన్నారు. కేజ్రీవాల్ ఢిల్లీ ప్రజల కోసం పని చేశారని గుర్తుచేశారు. ఫలితాలు ఆప్‌కు అనుకూలంగా వస్తాయని.. తిరిగి ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఆప్ నాయకుడు సుశీల్ గుప్తా తెలిపారు. ఫలితాల రోజున భారీ మెజార్టీతో గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు.
ఎగ్జిట్ పోల్స్ ఇవే..
పీపుల్స్‌పల్స్-కొడిమో
బీజేపీ: 51-60
ఆప్: 10-19
కాంగ్రెస్: 0
ఇతరులు: 0
టైమ్స్ నౌ
బీజేపీ: 39-45
ఆప్: 29-31
కాంగ్రెస్: 0-2
ఏబీపీ-మ్యాట్రిజ్
బీజేపీ: 35-40
ఆప్: 32-37
కాంగ్రెస్: 0-1
రిపబ్లిపకన్ మార్క్
బీజేపీ : 39-41
ఆప్ : 21-31
చాణక్య
బీజేపీ: 39-44
ఆప్: 25-28