NTV Telugu Site icon

Shraddha Walkar case: శ్రద్ధావాకర్ మర్డర్ కేసులో మరిన్ని ఆధారాలతో మరో ఛార్జిషీట్..

Shraddha Walkar

Shraddha Walkar

Shraddha Walkar case: దేశవ్యాప్తంగా శ్రద్ధా వాకర్ హత్య 2022లో సంచలనం సృష్టించింది. అఫ్తాబ్ పూనావాలతో లివింగ్ రిలేషన్‌లో ఉన్న శ్రద్ధాను అతనే అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. ఢిల్లీలో జరిగిన ఈ ఘటన యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురించేసింది. శ్రద్ధాని చంపేసి 35 ముక్కులుగా కట్ చేసి, ఫ్రిజ్‌లో పెట్టి ఢిల్లీ శివారు ప్రాంతాల్లో రాత్రిళ్లు పడేసేవాడు. ఒళ్లు గగుర్పాటుకు గురి చేసే ఈ కేసు, శ్రద్ధా తండ్రి ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చింది.

Read Also: Hyundai: గ్రామీణ భారతాన్ని “హ్యుందాయ్” ఎలా ఆకట్టుకుంటోంది..

ఈ కేసులో ఢిల్లీ పోలీసులు మరిన్ని సాక్ష్యాలతో అనుబంధ చార్జిషీట్ దాఖలు చేశారు. అఫ్తాబ్ పూనావాలపై నేరారోపణ చేసేందుకు ఢిల్లీ పోలీసులు డిజిటల్, ఫోరెన్సిక్ ఆధారాలతో కూడిని అనుబంధ చార్జిషీట్ దాఖలు చేసినట్లు కోర్టు వర్గాలు మంగళవారం తెలిపాయి. దాదాపుగా 3000 పేజీల చార్జిషీట్‌ని మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ అవిరల్ శుక్లా ముందు దాఖలు చేసినట్లు వారు తెలిపారు.

అఫ్తాబ్ పూనావాలా, శ్రద్ధాను మే 2022లో ఢిల్లీలోని మెహ్రౌలీలో హత్య చేశాడు. ఇతనిపై ఐపీసీ 302(హత్య), 201( నేర సాక్ష్యాలు మాయం చేయడం) వంటి అభియోగాలు మోపారు. చార్జిషీట్‌లో ప్రధానంగా గూగుల్ లొకేషన్‌లు, సెర్చ్ హిస్టరీ మరియు ఇతర డిజిటల్ మరియు ఫోరెన్సిక్ సాక్ష్యాధారాల నివేదికలు ఉన్నాయని వర్గాలు తెలిపాయి. గతేడాది జనవరిలో ఇతనిపై 6,629 పేజీల చార్జిషీట్ దాఖలు చేయబడింది.