NTV Telugu Site icon

Delhi CM Rekha Gupta: ‘శీష్ మహల్’ వద్దన్న ఢిల్లీ కొత్త సీఎం.. అధికార నివాసం ఎక్కడంటే?

Delhi Cm

Delhi Cm

ఢిల్లీ ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. షాలిమార్‌బాగ్‌ నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందిన రేఖా గుప్తాను ఢిల్లీ సీఎంగా బీజేపీ అధిష్ఠానం ఎంపిక చేసింది. కాగా సీఎం రేఖా గుప్త అధికార నివాసం ఎక్కడ అన్నదానిపై చర్చమొదలైంది. సివిల్‌ లైన్స్‌లో 6 ఫ్లాగ్‌స్టాఫ్‌ రోడ్‌ బంగ్లా ‘శీష్‌ మహల్‌’ను ముఖ్యమంత్రి అధికారిక నివాసంగా ఉపయోగించేవారు. అయితే వివాదాలకు కేరాఫ్ అడ్రస్ అయిన శీష్ మహల్ లో ఉండబోనని ఆమె ఇప్పటికే స్పష్టం చేసింది. శీష్ మహల్ ను మ్యూజియంగా మారుస్తామని చెప్పారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి అధికార నివాసం కోసం వెతకడం ప్రారంభించారు. లుటియెన్స్, సివిల్ లైన్స్ ప్రాంతంలో కొత్త బంగ్లా కోసం వెతుకుతున్నారు.

Also Read:Hitchcock: చిరంజీవి చేతుల మీదుగా ‘మాస్టర్ ఆఫ్ సస్పెన్స్ హిచ్‌కాక్’ సెకండ్ ఎడిషన్ లాంచ్..

సీఎం రేఖా గుప్త అధికారిక నివాసం కోసం సీఎం సిబ్బంది మూడు ప్రాంతాలను ఎంపిక చేసినట్లు సమాచారం. ఢిల్లీ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్ మెంట్, ఢిల్లీ ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం రాబోయే ఒకటి, రెండ్రోజుల్లో అధికారిక నివాసాన్ని ఖరారు చేయనున్నట్లు సమాచారం. అయితే ఢిల్లీ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్ మెంట్ సీఎంవో అధికారులకు ఇచ్చిన లిస్ట్ లో కొన్ని బంగ్లాలు సివిల్ లైన్స్ ప్రాంతంలో ఉండగా.. మరికొన్ని ఢిల్లీలోని లుటియెన్స్ లో ఉన్నాయి. వీటిల్లో ఢిల్లీ సీఎం ఏ బంగ్లాలో నివసించాలో నిర్ణయించుకోనున్నారు.

Also Read:Bangalore: స్నేహం ముసుగులో.. మహిళపై సామూహిక అత్యాచారం.. ముగ్గురు అరెస్టు

ఢిల్లీలోని లుటియెన్స్ ప్రాంతంలో రాష్ట్రపతి భవన్, కేంద్ర మంత్రుల నివాసాలు, సచివాలయంతో సహా అనేక ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నాయి. ఈ ప్రాంతం దేశ పరిపాలనా అధికార కేంద్రంగా పరిగణించబడుతుంది. అదే సమయంలో, సివిల్ లైన్స్ అనేది ఇప్పటివరకు ఢిల్లీ ముఖ్యమంత్రి అధికారిక నివాసం ఉన్న ప్రాంతం. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ (ఎల్జీ)తో సహా గత ఆప్ ప్రభుత్వంలోని మంత్రులందరికీ ఈ ప్రాంతంలో బంగ్లాలు కేటాయించబడ్డాయి.