ఢిల్లీ ముఖ్యమంత్రి అతిషికి ఎట్టకేలకు పీడబ్ల్యూడీ అధికారులు అధికారిక నివాసం కేటాయించారు. మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఖాళీ చేసిన బంగ్లాలోకి సోమవారం అతిషి షిప్ట్ అయ్యారు. వస్తువులన్నీ తరలించారు. అయితే అధికారిక పత్రం రాలేదంటూ ఆమె వస్తువులను అధికారులు తీసుకెళ్లిపోయారు. దీంతో గవర్నర్ వర్సెస్ ఆప్ మధ్య దుమారం చెలరేగింది. కేంద్రం అండతో గవర్నర్ వీకే. సక్సేనా.. ముఖ్యమంత్రి వస్తువులను తరలించారంటూ సీఎంవో ఆరోపించింది.
ఇది కూడా చదవండి: Modi-Trudeau: లావోస్‌లో మోడీతో కెనడా ప్రధాని ట్రూడో చర్చలు
మొత్తానికి వివాదం మరింత దుమారం చెలరేగక ముందే సమస్య సద్దుమణిగింది. ఢిల్లీ సీఎం అతిషికి 6, ఫ్లాగ్‌స్టాఫ్ రోడ్‌లోని సివిల్ లైన్స్ నివాసాన్ని అధికారికంగా కేటాయించినట్లు పీడబ్ల్యుడీ అధికారిక నోటిఫికేషన్ విడుదలైనట్లు శుక్రవారం తెలిపింది. నోటిఫికేషన్ వెలువడిన ఎనిమిది రోజుల్లోగా బంగ్లాకు సంబంధించిన అంగీకారపత్రాన్ని సీఎం సమర్పించాల్సి ఉంటుందని లేఖలో పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: Noel Tata: టాటా ట్రస్ట్‌ల కొత్త ఛైర్మన్ నోయెల్ టాటాపై బుర్జ్ ఖలీఫా బాధ్యత!
గత నెలలో కేజ్రీవాల్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. దీంతో ఆయన స్థానంలో అతిషిని కూర్చోబెట్టారు. సెప్టెంబర్ 21న అతిషి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. అయితే హర్యానా ఎన్నికల ప్రచారం నేపథ్యంలో కేజ్రీవాల్ వెంటనే అధికారిక నివాసాన్ని ఖాళీ చేయలేదు. ఈనెల 4న బంగ్లాను ఖాళీ చేసి పార్టీ నేతకు చెందిన ఇంట్లోకి వెళ్లిపోయారు. ఇక అతిషి కేజ్రీవాల్ ఖాళీ చేసిన ఇంట్లోకి సోమవారం వెళ్లిపోయారు. తీరా చూస్తే.. అధికారిక పత్రం రాలేదంటే అధికారులు.. అతిషి వస్తువులను తరలించారు. దీంతో గవర్నర్-ఆప్ మధ్య తీవ్ర ఆరోపణలు జరిగాయి.
ఇది కూడా చదవండి: CM Revanth Reddy : విజయమే లక్ష్యంగా పని చేయాలి.. ఎమ్మెల్సీ ఎన్నిక జూమ్ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి