NTV Telugu Site icon

Kejriwal: రేపే కేజ్రీవాల్ రాజీనామా.. ఎల్జీ అపాయింట్‌మెంట్!

Kejriwal

Kejriwal

ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ మంగళవారం తన పదవికి రాజీనామా చేయనున్నారు. ఇందుకోసం లెఫ్ట్‌నెంట్ గవర్నర్ వీకే.సక్సేనా అపాయింట్‌మెంట్ ఇచ్చారు. మంగళవారం సాయంత్రం 4:30 గంటలకు వీకే.సక్సేనాను కేజ్రీవాల్ కలిసి తన పదవికి రాజీనామా చేయనున్నారు. లిక్కర్ పాలసీ కేసులో ఇటీవలే కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఆయన జైలు నుంచి విడుదలయ్యారు. ఇంటికి చేరుకున్న ఆయన ఆదివారం సంచలన ప్రకటన చేశారు. రెండ్రోజుల్లో తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో పొలిటికల్‌గా తీవ్ర సంచలనం సృష్టించింది.

ఇది కూడా చదవండి: Prashanth Reddy: ఢిల్లీ బాసులను ప్రసన్నం చేసుకోవడానికి.. తెలంగాణ ఆత్మను తాకట్టు పెట్టారు

ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో కేజ్రీవాల్‌ను మార్చి 21న ఈడీ అధికారులు అరెస్ట్ చేసి తీహార్ జైలుకు తరలించారు. అనంతరం ఆయన పలుమార్లు బెయిల్‌కు అప్లై చేసినా తిరస్కరణకు గురయ్యాయి. ఎట్టకేలకు సుప్రీంకోర్టు బెయిల్ ఇవ్వడంతో జైలు నుంచి విడుదలయ్యారు. అయితే ఈ వేడిలోనే ప్రభుత్వం రద్దైతే.. తనను కేంద్రం ఇబ్బంది పెట్టి.. జైల్లో పెట్టిన విషయం ప్రజలకు గుర్తుంటుందని కేజ్రీవాల్, ఆప్ నేతలు భావిస్తున్నారు. అంతేకాకుండా త్వరలోనే మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికలు ఉన్నాయి. వీటితో పాటే ఢిల్లీ ఎన్నికలు జరిగితే ప్రజల నుంచి సానుభూతి పొందవచ్చని ఆప్ నేతలు అంచనా వేస్తున్నట్లు తెలుస్తోంది.

ఇది కూడా చదవండి: Janasena: షాకింగ్: జానీ మాస్టర్ కు జనసేన కీలక ఆదేశాలు!