NTV Telugu Site icon

Atishi-Modi: ప్రధాని మోడీతో సీఎం అతిషి సమావేశం.. ముఖ్యమంత్రిగా తొలి భేటీ!

Pmmodi

Pmmodi

ప్రధాని మోడీని ఢిల్లీ ముఖ్యమంత్రి అతిషి కలిశారు. సీఎంగా బాధ్యతలు స్వీకరించాక ప్రధాని మోడీని కలవడం ఇదే మొదటిసారి కావడం విశేషం. అతిషి భేటీని ప్రధాని మంత్రి కార్యాలయం ఎక్స్ ట్విట్టర్ ద్వారా తెలిపింది. సెప్టెంబర్ 21న ఢిల్లీ ముఖ్యమంత్రిగా అతిషి ప్రమాణస్వీకారం చేశారు.

ఇది కూడా చదవండి: Chiranjeevi Blood Bank: చిరంజీవి బ్లడ్ బ్యాంక్ లో రక్తదానం చేసిన కర్ణాటక ఎమ్మెల్యే

అయితే ఇటీవల బంగ్లా కేటాయింపుపై గవర్నర్ వర్సెస్ సీఎంవో రగడ నడిచింది. మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఖాళీ చేసిన నివాసంలోకి సీఎం అతిషి మకాం మార్చారు. అయితే అధికారులు ఆమె వస్తువులను తొలగించి.. సీల్ చేశారు. దీంతో కేంద్రం ఆదేశాలతో లెఫ్టినెంట్ గవర్నర్.. ముఖ్యమంత్రి వస్తువులను తొలగించారని ఆప్ ఆరోపించింది. అయితే అధికారిక పత్రాలు రానందునే వస్తువులు తొలగించినట్లు అధికారులు తెలిపారు. రెండు రోజుల తర్వాత అధికారిక పత్రాలు వచ్చాయి. దీంతో వివాదదం సద్దుమణిగింది.

ఇది కూడా చదవండి: AP Liquor Shops: ప్రశాంతంగా ముగిసిన మద్యం దుకాణాల కేటాయింపు.. లాటరీలో మహిళల హవా

ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో కేజ్రీవాల్‌ను ఈడీ అధికారులు అరెస్ట్ చేసి తీహార్ జైలుకు తరలించారు. ఆరు నెలల తర్వాత సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో ఇంటికి చేరుకున్నారు. అనూహ్యంగా ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి అతిషిని ఆ సీటులో కూర్చోబెట్టారు. ప్రజలు విశ్వసించినప్పుడే మళ్లీ సీఎంగా సీటులో కూర్చుంటానని శపథం చేశారు. ఇదిలా ఉంటే త్వరలోనే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.