Delhi Car Blast: మహిళా ఉగ్ర డాక్టర్‌కు పుల్వామా మాస్టర్‌మైండ్ భార్యతో సంబంధం..
- ఢిల్లీ ఎర్రకోట కార్ పేలుడు ఘటనలో కీలక విషయాలు..
- మహిళా ఉగ్ర డాక్టర్‌కు పుల్వామా సూత్రధారి భార్యతో సంబంధం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Delhi Car Blast: ఢిల్లీ పేలుడు, ఫరీదాబాద్ పేలుడు పదార్థాల అక్రమ రవాణాలో జైష్ ఏ మహ్మద్ సంబంధాలను దర్యాప్తు చేస్తున్న అధికారులకు కీలక విషయం తెలిసింది. జైష్ కమాండర్, పుల్వామా దాడి సూత్రధారి ఉమర్ ఫరూక్ భార్య అఫిరా బీబీతో, ఢిల్లీ ఉగ్ర ఘటనతో సంబంధం ఉన్న మహిళా డాక్టర్ షాహీన్ సయీద్‌కు సంబంధాలు ఉన్నట్లు కనుగొన్నారు. 2019లో జైషే మహ్మద్ ఉగ్రవాది సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌ని పేలుడు పదార్థాలు ఉన్న కారుతో ఢీ కొట్టాడు. ఈ ఉగ్రదాడిలో 40 మంది తమ ప్రాణాలను కోల్పోయారు. ఈ దాడి తర్వాత జరిగిన ఎన్‌కౌంటర్‌లో జైష్ చీప్ మసూద్ అజర్ మేనల్లుడు ఉమర్ ఫరూఖ్ మరణించాడు. ఈ ఉమర్ ఫరూక్ భార్యనే అఫిరా బీబీ.
Read Also: Divorce Case: “నా భార్యకు కుక్కలు అంటే ప్రేమ, దయచేసి విడాకులు ఇప్పించండి..”
Also Read
- Work From Home: కేంద్రం కంపెనీలకు "వర్క్ ఫ్రమ్ హోమ్" ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
- Indian Railways logo: ఇండియన్ రైల్వేస్ లోగోలో భారీ మార్పు.. ఇకపై 18 నక్షత్రాలు..ఈ మార్పుకు కారణం ఏమిటి?
- Uttar Pradesh: యూపీలో ప్రకృతి ప్రకోపం.. పిడుగులు, వానాకాలం బీభత్సానికి 111 మంది బలి
- Delhi Work From Home: ప్రభుత్వం కీలక నిర్ణయం.. రెండు రోజులు వర్క్ ఫ్రమ్ హోమ్.. పొదుపు చర్యల జాబితా విడుదల
జైషే మహ్మద్ ఇటీవల తన ఉగ్ర పన్నాగాలను మార్చుకుంది. కొత్తగా మహిళా జీహాదీలను తయారు చేసేందుకు సిద్ధమైంది. మహిళా ఉగ్రవాదుల కోసం ‘‘జమాల్ అల్ మోమినాత్’’ను ప్రారంభించింది. ఢిల్లీ పేలుడుకు కొన్ని వారాల ముందు అఫిరా ఈ జిహాదీ గ్రూప్ సలహా మండి షురాలో చేరారు. మసూద్ అజర్ చెల్లెలు సాదియా అజర్‌తో కలిసి అఫిరా పనిచేస్తోంది. వీరిద్దరు కూడా ఢిల్లీ పేలుడు కుట్రతో సంబంధం ఉన్న షాహీన్ సయీద్‌తో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిసింది.
ఫరీదాబాద్‌లోని అల్-ఫలాహ్ విశ్వవిద్యాలయంలో సీనియర్ డాక్టర్‌గా పనిచేస్తున్న షాహీన్ సయీద్ కారులో అస్సాల్ట్ రైఫిల్స్ మరియు ఇతర మందుగుండు సామగ్రి లభించడంతో ఆమెను అరెస్టు చేశారు. జమాత్-ఉల్-మోమినాత్ భారతదేశ విభాగానికి ఈమె చీఫ్‌గా పనిచేస్తున్నట్లు అనుమానిస్తున్నారు. భారతదేశంలో ఉగ్రవాదం కోసం మహిళల్ని రాడికలైజ్ చేసే పనిని షహీద్ సయీద్‌కు అప్పగించినట్లు దర్యాప్తులో తేలింది.
తాజావార్తలు
-
Tirupati Crime News: తిరుపతిలో దారుణం.. బాలికపై బాబాయ్ అత్యాచారం!
-
Hyderabad: శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు బాంబు బెదిరింపు.. ఆ విమానమే టార్గెట్ అంటూ..
-
Ravi Shastri: సూర్యకుమార్ యాదవ్ శకం తర్వాత కెప్టెన్ అతనే.. కీలక వ్యాఖ్యలు చేసిన క్రికెట్ దిగ్గజం.!
-
Maa Inti Bangaram: తెలివిగా తప్పించుకున్న సమంత..!
-
Pakistan: పాకిస్థాన్ సైన్యాన్ని వణికించిన ఉగ్రవాదులు.. సైనిక స్థావరంపై ఆత్మాహుతి దాడి.. 15 మంది మృతి!
ట్రెండింగ్
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!