Delhi Assembly Elections: ఢిల్లీలో మోగిన ఎన్నికల నగారా.. ఎన్నికలు ఎప్పుడంటే..!

  • ఢిల్లీలో మోగిన ఎన్నికల నగారా
  • ఫిబ్రవరి 5న పోలింగ్.. ఫిబ్రవరి 8న ఫలితాలు
Delhipolls

Delhipolls

దేశ రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం షెడ్యూల్ విడుదల చేసింది. ఫిబ్రవరి 5న ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. ఫిబ్రవరి 8న ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి. జనవరి 10న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. జనవరి 17న నామినేషన్లకు చివరి తేదీ. 13000 పోలింగ్ స్టేషన్లు ఉన్నట్లు పేర్కొంది.

ఢిల్లీ అసెంబ్లీలో మొత్తం 70 స్థానాలు ఉండగా అందులో 58 జనరల్ స్థానాలు ఉన్నాయి. మరో 12 ఎస్సీ స్థానాలు ఉన్నట్లు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ తెలిపారు. మొత్తం 1.55 కోట్ల మంది  ఓటర్లు ఉన్నారు. అందులో పురుషులు 83. 49 లక్షలు, మహిళలు 71. 74 లక్షలు ఉండగా.. యువ ఓటర్లు 25.89 వేల మంది ఉన్నారు. తొలిసారి ఓటు హక్కు వినియోగించుకునే వారు 2.08 లక్షలు, వికలాంగులు 79, 436 మంది, వయోవృద్ధులు 830, ట్రాన్స్ జెండర్స్ 1261 మంది ఉన్నారని ఎలక్షన్ కమిషన్ తెలిపింది.

హస్తినలో ప్రధానంగా మూడు పార్టీల మధ్య పోటీ నెలకొంది. అధికార పార్టీ ఆప్, బీజేపీ, కాంగ్రెస్ మధ్య పోరు జరగనుంది. ఇప్పటికే ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థులను ప్రకటించగా.. బీజేపీ తొలి విడతలో 29 మంది అభ్యర్థులను ప్రకటించింది. కాంగ్రెస్ కూడా కొంత మంది పేర్లను వెల్లడించింది. ఈసారి ఆప్-బీజేపీ మధ్య పోటీ నెలకొననుంది.