NTV Telugu Site icon

Delhi Assembly Election 2025 Live UPDATES: ఢిల్లీలో కొనసాగుతున్న పోలింగ్.. ఉదయం 11గంటల వరకు 19. 95 శాతం

Delhi

Delhi

Delhi Assembly Election 2025 Live UPDATES: దేశ రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల కొనసాగుతుంది. ఈరోజు సాయంత్రం 6 గంటల వరకు ఓటింగ్‌ ప్రక్రియ కొనసాగనుంది. 1.56 కోట్ల మందికి పైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం ఉంది. బీజేపీ, కాంగ్రెస్ ఆమ్‌ ఆద్మీ పార్టీల మధ్య హోరాహోరీగా పోటీ నెలకొంది. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 699 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వీరి భవితవ్యాన్ని తేల్చడానికి మొత్తం 70 అసెంబ్లీ స్థానాల్లోని 13, 766 పోలింగ్‌ కేంద్రాలలో ప్రజలు ఓట్లు వేయనున్నారు. హోమ్‌ ఓటింగ్‌ సౌకర్యం ద్వారా అర్హత కలిగిన 7,553 మంది ఓటర్లలో 6,980 మంది ఇప్పటికే తమ ఓటు హక్కును ఉపయోగించుకున్నారు. ఈ నెల 8వ తేదీన ఓట్ల లెక్కించి, ఫలితాలు విడుదల చేయనున్నారు. మరిన్నీ వివరాల కోసం ఎన్టీవీ లైవ్ అప్ డేట్స్ మీ కోసం..

  • 05 Feb 2025 12:05 PM (IST)

    ఓటు హక్కును వినియోగించుకున్న సోనియా గాంధీ..

    కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్ సోనియా గాంధీ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా నిర్మాణ్ భవన్ లో తన ఓటు హక్కునువినియోగించుకున్నారు. సోనియా గాంధీ వెంట.. కుమార్తె ప్రియాంక గాంధీ, న్యూఢిల్లీ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి సందీప్ దీక్షిత్ కూడా ఉన్నారు.

  • 05 Feb 2025 11:55 AM (IST)

    కుంటుంబ సభ్యులతో కలిసి ఓటేసిన కేజ్రీవాల్..

    ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్, ఆయన భార్య సునీతా కేజ్రీవాల్, తల్లిదండ్రులు గోవింద్ రామ్ కేజ్రీవాల్, గీతా దేవిలతో కలిసి ఢిల్లీలోని లేడీ ఇర్విన్ సీనియర్ సెకండరీ స్కూల్ లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. న్యూఢిల్లీ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా బరిలోకి దిగుతున్న కేజ్రీవాల్.. కాంగ్రెస్ తరపున సందీప్ దీక్షిత్, బీజేపీ అభ్యర్థి పర్వేశ్ వర్మ బరిలో ఉన్నారు..

  • 05 Feb 2025 11:46 AM (IST)

    ఢిల్లీలోని ఏ ప్రాంతంలో ఎంత ఓటింగ్ శాతం అంటే..?

    సెంట్రల్ ఢిల్లీ-16.46
    తూర్పు- 20.03
    న్యూఢిల్లీ- 16.80
    ఉత్తర ఢిల్లీ- 18.63
    ఈశాన్య ఢిల్లీ- 24.87
    వాయువ్య ఢిల్లీ- 19.17
    షాదారా- 23.30
    దక్షిణ ఢిల్లీ- 19.17
    ఆగ్నేయ ఢిల్లీ- 19.66
    నైరుతి ఢిల్లీ- 21.90
    పశ్చిమ ఢిల్లీ- 17.67

  • 05 Feb 2025 11:43 AM (IST)

    భర్త రాబర్ట్ వాద్రాతో కలిసి ఓటేసిన ప్రియాంక గాంధీ..

    2025 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేయడానికి కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ తన భర్త రాబర్ట్ వాద్రా, కుమారుడు రెహన్ వాద్రాతో కలిసి లోధి ఎస్టేట్‌లోని పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కును వినియోగించుకున్నారు..

  • 05 Feb 2025 11:40 AM (IST)

    ఉదయం 11గంటల వరకు ఓటింగ్ శాతం ఎంతంటే..?

    ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ఓటింగ్ కొనసాగుతోంది.. ఉదయం 11 గంటల వరకు 19.95 శాతం ఓటింగ్..

  • 05 Feb 2025 11:25 AM (IST)

    ఓటేసిన ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్

    భారత ఉపాధ్యక్షుడు జగదీప్ జగదీప్ ధన్ఖడ్, ఆయన భార్య సుదేశ్ జగదీప్ ధన్ఖడ్ తో కలిసి నార్త్ అవెన్యూలోని సీపీడబ్ల్యూడీ సర్వీస్ సెంటర్ లో ఉన్న పోలింగ్ బూత్ లో ఓటు హక్కును వినియోగించుకున్నారు.

  • 05 Feb 2025 11:21 AM (IST)

    పోలింగ్ బూత్‌లలో బీజేపీ ప్రచార సామగ్రిని ఉంచింది: ఆప్

    భారతీయ జనతా పార్టీ పోలింగ్ బూత్‌లలో ప్రచార సామగ్రిని బహిరంగంగా ఉంచారని.. పోలీసులు కూడా ఏం చేయడం లేదని ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపించింది. ఎన్నికల అధికారులు కూడా చూస్తూనే ఉన్నారని తప్పా ఏం చేయలేకపోతున్నారు.. ఈ ఎన్నికల్లో ఏం జరుగుతోందని ఎలక్షన్ కమిషన్ ను ప్రశ్నించిన ఆమ్ ఆద్మీ పార్టీ..

  • 05 Feb 2025 11:06 AM (IST)

    కేజ్రీవాల్ స్వార్థపరుడు: అన్నా హజారే

    ఢిల్లీ అసెబ్లీ ఎన్నికల ఓటింగ్ సందర్భంగా అన్నా హజారే మాట్లాడుతూ.. మొదట్లో అరవింద్ కేజ్రీవాల్ ఉద్దేశాలు స్పష్టంగా ఉండేవి.. కానీ ఆయన స్వార్థపరుడని నేను గ్రహించినప్పటి నుంచి అతడికి దూరంగా ఉన్నాను.. ఆయన ఒక పార్టీని స్థాపించారు.. నేడు అదే కేజ్రీవాల్ మద్యం గురించి మాట్లాడుతున్నారు.. నేను అతనిని విడిచిపెట్టాను.. ఇప్పుడు మనం జీవితంలో స్వచ్ఛమైన ప్రవర్తన, స్వచ్ఛమైన ఆలోచనలు, త్యాగాలు కలిగిన అభ్యర్థికి ఓటు వేస్తేనే దేశం మారుతుంది: అన్నాహజారే

  • 05 Feb 2025 10:45 AM (IST)

    ఢిల్లీలో అతిపెద్ద స్కామ్ ఎవరు చేశారో గుర్తుంచుకోండి: రాహుల్ గాంధీ

    కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ట్వీట్ చేస్తూ.. నా ప్రియమైన ఢిల్లీ సోదర సోదరీమణులారా, మీరందరూ ఈరోజు వెళ్లి ఓటు వేయమని నేను విజ్ఞప్తి చేస్తున్నాను.. మీరు కాంగ్రెస్‌కు ఇచ్చే ప్రతి ఓటు మీ హక్కులను కాపాడుతుంది.. రాజ్యాంగాన్ని బలోపేతం చేయడంతో పాటు ఢిల్లీని తిరిగి పురోగతి మార్గంలో నడిపిస్తుంది అన్నారు. ఓటు వేసేటప్పుడు, కలుషితమైన గాలి, మురికి నీరు, పడైపోయిన రోడ్లకు ఎవరు బాధ్యులో గుర్తుంచుకోండి.. స్వచ్ఛమైన రాజకీయాలు చేయడం గురించి మాట్లాడుకుంటూ ఢిల్లీలో అతి పెద్ద కుంభకోణానికి పాల్పడింది ఎవరు?: రాహుల్ గాంధీ

  • 05 Feb 2025 10:43 AM (IST)

    పోలింగ్ బూత్ దగ్గర బీజేపీ డబ్బులు పంచుతుంది: సంజయ్ సింగ్

    అత్యంత సున్నితమైన ప్రాంతం రాష్ట్రపతి భవన్ సమీపంలోని బూత్ నంబర్ 27 N బ్లాక్‌లో బీజేపీ గూండాలు డబ్బులు పంచుతున్నారని ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు సంజయ్ సింగ్ ఆరోపించారు. నేను అక్కడికి చేరుకునేసరికి వారు పారిపోయారు అని తెలిపారు. ఢిల్లీలో ఎన్నికలు జరుగుతున్నాయా లేదా అనేది ఒక జోక్.

  • 05 Feb 2025 10:41 AM (IST)

    కేజ్రీవాల్, సిసోడియా, అతిషి ఎన్నికల్లో ఓడిపోతారు: రమేష్ బిధురి

    కల్కాజీ అసెంబ్లీ స్థానం నుంచి బీజేపీ తరపున పోటీ చేస్తున్న రమేష్ బిధురి మాట్లాడుతూ.. ఢిల్లీ ప్రజలు దేశ రాజధాని అభివృద్ధికి ఓటు వేయబోతున్నారు.. గత 10 సంవత్సరాలుగా ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీని నాశనం చేసింది.. ప్రధాని మోడీ దేశంలోని మిగిలిన ప్రాంతాల మాదిరిగానే ఢిల్లీని కూడా అభివృద్ధి చేయాలనుకుంటున్నారు.. ఢిల్లీ అభివృద్ధి కోసం ఓటు వేయాలని నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను.. అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, అతిషి అందరూ ఎన్నికల్లో ఓడిపోతారు: రమేశ్ బిధూరి

  • 05 Feb 2025 10:08 AM (IST)

    ఉదయం 9 గంటల వరకు ఢిల్లీలో 8.10 శాతం పోలింగ్..

    ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేసేందుకు ఓటర్లు ఉదయం నుంచి ఉత్సాహంగా వచ్చారు. ఉదయం 9 గంటల వరకు 8.10 శాతం ఓటింగ్ జరిగినట్లు ఎన్నికల సంఘం తెలిపింది. ఏఐఎంఐఎం అభ్యర్థి తాహిర్ హుస్సేన్ ప్రాతినిధ్యం వహిస్తున్న ముస్తఫాబాద్ స్థానంలో 12.43 శాతం పోలింగ్ నమోదైంది అని ఈసీ ప్రకటించింది.

  • 05 Feb 2025 09:27 AM (IST)

    ఓటేసిన ముఖ్యమంత్రి అతిషి..

    ఢిల్లీ ముఖ్యమంత్రి అతిషి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సత్యానికి- అసత్యానికి మధ్య యుద్ధం కొనసాగుతుంది.. ఈ యుద్ధంలో ఢిల్లీ ప్రజలు సత్యానికి అండగా నిలుస్తారని అనుకుంటున్నా.. గూండాయిజాన్ని ఓడిస్తారని నేను ఆశిస్తున్నా..

  • 05 Feb 2025 09:20 AM (IST)

    ఓటు హక్కును వినియోగించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము..

    ఢిల్లీలో కొనసాగుతున్న పోలింగ్.. సమాధ్యలోని డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ కేంద్రీయ విద్యాలయంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఓటు హక్కును వినియోగించుకున్నారు.

  • 05 Feb 2025 09:14 AM (IST)

    ఓటేసేన సిసోడియా..

    న్యూఢిల్లీ అసెంబ్లీ నియోజకవర్గంలోని లేడీ ఇర్విన్ సీనియర్ సెకండరీ స్కూల్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఆప్ నాయకుడు, జంగ్‌పురా అసెంబ్లీ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి మనీష్ సిసోడియా ఓటు వేశారు. ఆయన భార్య సీమా సిసోడియా కూడా ఇక్కడ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

  • 05 Feb 2025 09:13 AM (IST)

    పోలింగ్ ప్రక్రియలో పాల్గొనండి... ఓటర్లకు మనీష్ సిసోడియా విజ్ఞప్తి..

    ప్రజాస్వామ్యానికి సంబంధించిన ఈ గొప్ప పండుగలో ఉత్సాహంగా పాల్గొని ఓటు వేయాలని ఢిల్లీ ఓటర్లందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను అని ఆప్ నాయకుడు మనీష్ సిసోడియా కోరారు. ఓటు వేయడం ప్రతి పౌరుడి హక్కు, ప్రజాస్వామ్య వ్యవస్థను బలోపేతం చేసే బాధ్యత.. మీరు వేసే ప్రతి ఓటు మన పిల్లల మెరుగైన రేపటి కోసం ఉపయోగపడుతుంది.. ఢిల్లీ పురోగతిని ముందుకు తీసుకెళ్లడానికి మీ ఓటు హక్కును ఉపయోగించుకోండి: సిసోడియా

  • 05 Feb 2025 09:10 AM (IST)

    ఓటేసిన రాహుల్ గాంధీ..

    2025 ఢిల్లీ ఎన్నికల్లో ఓటు వేసిన లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ..

  • 05 Feb 2025 09:08 AM (IST)

    ఓటు వేసిన భారత విదేశాంగ మంత్రి జైశంకర్..

    తుగ్లక్ క్రెసెంట్‌లోని NDMC స్కూల్ ఆఫ్ సైన్స్ అండ్ హ్యుమానిటీస్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్, ఆయన భార్య క్యోకో జైశంకర్ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా జైశంకర్ మాట్లాడుతూ.. నేను తొలి ఓటర్లలో ఒకడిని.. ప్రజలు మార్పు కోసం సిద్ధంగా ఉన్నారని భావిస్తున్నాను..

  • 05 Feb 2025 09:04 AM (IST)

    ఢిల్లీలో కొనసాగుతున్న ఓటింగ్.. క్యూ కట్టిన ఓటర్లు..

    ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది.. ఉదయం 7గంటల నుంచే ఓటర్లు భారీగా తరలి వస్తున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద భారీ క్యూలైన్లలో ఓటర్లు వేచి ఉన్నారు..

  • 05 Feb 2025 08:46 AM (IST)

    మహిళకు ఫ్లయింగ్ కిస్ ఇచ్చిన ఆప్ ఎమ్మెల్యేపై కేసు నమోదు..

    ఆప్ ఎమ్మెల్యే దినేష్ మోహానియా తనకు ఫ్లయింగ్ కిస్ ఇచ్చినందుకు ఢిల్లీలోని సంగం విహార్ పోలీస్ స్టేషన్‌లో ఒక మహిళ కేసు నమోదు చేసింది. ఢిల్లీ పోలీసులు 323/341/509 సెక్షన్ల కింద కేసు రిజిస్టర్ చేశారు.

  • 05 Feb 2025 08:44 AM (IST)

    ఓటేసిన కాంగ్రెస్ అభ్యర్థి అల్కా లాంబా..

    2025 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కల్కాజీ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి అల్కా లాంబా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక, ఆప్ తరపున కల్కాజీ స్థానం నుంచి ఢిల్లీ సీఎం అతిషి పోటీ చేస్తుండగా, బీజేపీ తన మాజీ ఎంపీ రమేష్ బిధురి బరిలో ఉన్నారు.

  • 05 Feb 2025 08:37 AM (IST)

    తప్పుడు వాగ్దానాలకి వ్యతిరేకంగా ఓటు వేయండి: అమిత్ షా

    కేంద్ర హోంమంత్రి అమిత్ షా ట్వీట్ చేస్తూ.. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేయబోతున్న నా సోదరీమణులు, సోదరులు అందరు తప్పుడు వాగ్దానాలు, కలుషితమైన యమునా నది, మద్యం దుకాణాలు, పడైపోయిన రోడ్లు, మురికి నీటికి వ్యతిరేకంగా ఓటు వేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను.. ప్రజా సంక్షేమం పట్ల బలమైన ట్రాక్ రికార్డ్.. ఢిల్లీ అభివృద్ధి పట్ల స్పష్టమైన దార్శనికత కలిగిన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఈరోజు పెద్ద సంఖ్యలో తమ ఓటు హక్కును వినియోగించకోండి.. మీ ఒక్క ఓటు ఢిల్లీని ప్రపంచంలోనే అత్యంత అభివృద్ధి చెందిన రాజధానిగా మార్చగలదు: అమిత్ షా

  • 05 Feb 2025 08:33 AM (IST)

    ఈ ప్రజాస్వామ్య పండుగలో ప్రతి ఒక్కరు పాల్గొనండి: ప్రధాని మోడీ

    ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఈరోజు అన్ని స్థానాలకు పోలిగ్ జరుగుతుందని ప్రధాని మోడీ ట్వీట్ చేశారు. ఇక్కడి ఓటర్లందరూ ఈ ప్రజాస్వామ్య ఉత్సవంలో పాల్గొని తమ విలువైన ఓటును వేయాలని కోరుతున్నాను.. మొదటిసారి ఓటు వేయబోతున్న యువ మిత్రులందరికీ నా ప్రత్యేక శుభాకాంక్షలు.. మీరు గుర్తుంచుకోవాలి - మొదట ఓటు, తరువాత రిఫ్రెష్మెంట్: నరేంద్ర మోడీ

  • 05 Feb 2025 08:31 AM (IST)

    ఓటర్లు బీజేపీకి అనుకూలంగా ఓటు వేయాలి: పర్వేష్ వర్మ

    న్యూఢిల్లీ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నబీజేపీ అభ్యర్థి పర్వేష్ వర్మ మాట్లాడుతూ.. అరవింద్ కేజ్రీవాల్ యమునా నదిని శుభ్రం చేస్తానని చెప్పాడు కానీ ఏమీ చేయలేదు.. బీజేపీకి అనుకూలంగా ఓటు వేయాలని నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను.. హర్యానా ప్రభుత్వం యమునా నదిలో విషం కలిపిందని కేజ్రీవాల్ అన్నారు.. అతనికి మూడుసార్లు అవకాశం వచ్చింది.. కానీ అతను ఏమీ చేయలేదు.. ఈసారి ప్రజలు బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారు.. న్యూఢిల్లీ సీటులో కూడా కమలం వికసిస్తుంది: పర్వేష్ వర్మ

  • 05 Feb 2025 08:28 AM (IST)

    ఓటేసిన కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి

    ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి, ఆయన భార్య లక్ష్మీ పూరి శాంతి నికేతన్‌లోని మౌంట్ కార్మెల్ స్కూల్‌లో ఓటు వేశారు.

  • 05 Feb 2025 08:26 AM (IST)

    ఓటర్లకు సీఎం అతిషి విజ్ఞప్తి..

    ఢిల్లీలో నేటి ఎన్నికలు కేవలం ఎన్నికలు కాదు, ఇది మతపరమైన యుద్ధం' అని ఢిల్లీ ముఖ్యమంత్రి అతిషి ట్వీట్ చేశారు. ఇది మంచికి, చెడుకి మధ్య జరుగుతున్న యుద్ధం.. ఢిల్లీ ప్రజలందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను.. పని చేసేవారికి, మీకు మంచి చేసిన వారికే ఓటు వేయండి.. సత్యమే గెలుస్తుంది: సీఎం అతిషీ

  • 05 Feb 2025 08:02 AM (IST)

    ఎన్నికలు సజావుగా ఓటింగ్ జరిగేలా భారీ భద్రత..

    ఎన్నికలు సజావుగా ఓటింగ్ జరిగేలా ఢిల్లీ అంతటా బహుళ అంచెల భద్రతను మోహరించారు.. 220 కంపెనీల పారామిలిటరీ దళాలు.. 35,626 ఢిల్లీ పోలీసులతో పాటు 19,000 మంది హోమ్ గార్డులను నియమించిన ఈసీ. దాదాపు 3,000 పోలింగ్ బూత్‌లను సున్నితమైనవిగా గుర్తించారు.. పోలింగ్ కేంద్రాలపై డ్రోన్లతో నిఘా పెట్టిన ఎలక్షన్ కమిషన్

  • 05 Feb 2025 07:37 AM (IST)

    ఆప్- కాంగ్రెస్ కుస్తీ.. బీజేపీకి ప్లస్

    హ్యాట్రిక్ విక్టరీ కొట్టడానికి ప్రయత్నిస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీ.. ఇండియా కూటమిలోని ఆప్- కాంగ్రెస్ మధ్య కూస్తీ.. బీజేపీకి ప్లస్ అయ్యే అవకాశం..

  • 05 Feb 2025 07:24 AM (IST)

    ఢిల్లీతో పాటు మరో రెండు ఉప ఎన్నికలు..

    ఢిల్లీతో పాటు యూపీ, తమిళనాడులో 2 స్థానాలకు ఉప ఎన్నికలు..

  • 05 Feb 2025 07:23 AM (IST)

    న్యూ ఢిల్లీ కేజ్రీవాల్ పోటీ..

    న్యూ ఢిల్లీ అసెంబ్లీ స్థానం నుంచి అరవింద్ కేజ్రీవాల్ పోటీ.. బరిలో బీజేపీ నుంచి పర్వేజ్ శర్మ, కాంగ్రెస్ నుంచి సందీప్ దీక్షిత్.. కల్కాజీ నుంచి సీఎం అతిశీ పోటీ..

  • 05 Feb 2025 07:20 AM (IST)

    డ్రోన్లతో పోలింగ్ ప్రక్రియ పర్యవేక్షణ..

    ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో డ్రోన్లతో పర్యవేక్షణ.. ఈ నెల 8న ఓట్లలెక్కింపు, ఫలితాలు.. బీజేపీ, ఆప్‌, కాంగ్రెస్‌ నేతల మధ్య పోటాపోటీ.. అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఢిల్లీ పోలీసు యంత్రాంగం పటిష్ఠమైన చర్యలు.. సాయంత్రం 6.30 తర్వాత ఎగ్జిట్‌ పోల్స్‌..

  • 05 Feb 2025 07:19 AM (IST)

    ప్రారంభమైన పోలింగ్..

    ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ ప్రారంభం. ఢిల్లీలో 70 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్‌. సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనున్న పోలింగ్‌. ఎన్నికల బరిలో 699 మంది అభ్యర్థులు. ఢిల్లీలో మొత్తం 13,766 పోలింగ్‌ కేంద్రాలు.