NTV Telugu Site icon

Delhi-AAP: ఢిల్లీ ఆక్రమణల కూల్చివేత… రేపు ఎమ్మెల్యేలతో సీఎం కేజ్రీవాల్ సమావేశం

Kajriwal

Kajriwal

దేశ రాజధాని ఢిల్లీ వ్యాప్తంగా అక్రమ నిర్మాణాలను  కూల్చివేస్తోంది ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్.  బుల్డోజర్లలో ఆక్రమణలను కూల్చివేస్తున్నారు. ఈ బుల్డోజర్ కూల్చివేతల వివాదం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇటీవల కొన్ని ఢిల్లీలోని కొన్ని ఏరియాల్లో  కూల్చివేతలకు వ్యతిరేఖంగా స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రజలు తీవ్ర ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. అధికార ఆప్, కాంగ్రెస్, వామపక్షాల నాయకులు ఎంతగా వ్యతిరేఖించినా ఢిల్లీ మున్సిపల్ అధికారులు తగ్గడం లేదు. పోలీసులు, సీఆర్ఫీఎఫ్ భద్రత నడుమ ఆక్రమణలను కూల్చివేస్తున్నారు.

ఇటీవల ఢిల్లీలోని న్యూ ఫ్రెండ్స్ కాలనీ, షాహీన్ బాగ్ ఏరియాల్లో కూల్చివేతలపై తీవ్ర ఆందోళనలు జరిగాయి. ఇదిలా ఉంటే గురువారం మదన్ పూర్ ఖాదర్ కళ్యాణ్ నగర్ కూల్చివేతల సమయంలో ఆప్ ఎమ్మెల్యే అమనతుల్లా ఖాన్ వ్యతిరేఖంగా ఆందోళన చేశారు. క్రమంలో ఆయన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు ఆయనపై హిస్టరీ షీట్ బుక్ చేశారు. మొత్తం 18 ఎఫ్ఐఆర్లు బుక్ చేశారు. తాజాా ఈరోజు శ్యాంపూర్  ఏరియాల్లో ఆక్రమణలను కూల్చివేశారు.

ఇదిలా ఉండే ఢిల్లీ నగర వ్యాప్తంగా కూల్చివేతలపై సీఎం కేజ్రీవాల్ సమావేశం నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఆప్ ఎమ్మెల్యేలు అందరూ మీటింగ్ కు రావాల్సిందిగా శుక్రవారం ఆదేశించారు. ఆప్ ఎమ్మెల్యే అమనుతుల్లా ఖాన్ ను అరెస్ట్ చేసిన ఒక రోజు తర్వాత సీఎం కేజ్రీవాల్ ఈ సమావేశానికి పిలుపునిచ్చారు.

మరోవైపు బుల్డోజర్ల చర్యపై, ఢిల్లీలో ఆక్రమణల కూల్చివేత విధ్వంసాన్ని ఆపాలంటూ ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. బీజేపీ బుల్డోజర్ రాజకీయాలను ఖండించారు. కాగా.. హనుమాన్ జయంతి శోభాయాత్ర సందర్భంగా జహంగీర్ పురిలోని ఓ వర్గం వారు శోభాయాత్రపై రాళ్లు రువ్వడంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ ఏర్పడింది. ఆందోళనకారులు అక్రమ నిర్మాణాలపై నుంచి రాళ్లు రువ్వినట్లు అధికారులు గుర్తించడంతో రాజధానిలో బుల్డోజర్ల యాక్షన్ ప్రారంభం అయింది.