NTV Telugu Site icon

Delhi: ఢిల్లీలో దారుణం.. లైంగిక దాడిని ఎదిరించినందుకు ఏడేళ్ల బాలుడు హత్య

Crime

Crime

దేశంలో రోజురోజుకు దారుణాలు పెరిగిపోతున్నాయి. తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో మరో దారుణం జరిగింది. దీపావళి సందర్భంగా డబుల్ మర్డర్ సంఘటన మరువక ముందే.. మరో ఘోరం వెలుగులోకి వచ్చింది. లైంగిక వేధింపులు ఎదిరించినందుకు ఏడేళ్ల బాలుడిని యువకుడు చంపేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు 100 సీసీకెమెరాలను పరిశీలించి నిందితుడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు.

ఇది కూడా చదవండి: Minister Nadendla Manohar: ప్రతి మహిళకు భరోసా ఇచ్చేందుకు వీలుగా దీపం-2 పథకం

ఢిల్లీలోని షాహీన్‌బాగ్‌లో నిర్మాణంలో ఉన్న ప్రదేశంలో మైనర్ చనిపోయినట్లుగా గురువారం పోలీసులకు సమాచారం అందింది. సంఘటనాస్థలికి చేరుకున్న పోలీసులకు తల నుంచి రక్తస్రావం జరుగుతున్న బాలుడి మృతదేహాన్ని స్వాదీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. 100 సీసీ కెమెరాలను జల్లెడ పట్టారు. అందులో ఒక వ్యక్తి.. మైనర్ తీసుకెళ్తున్నట్లు కనిపించింది. జామియా నగర్‌కు చెందిన వ్యక్తిని అరెస్ట్ చేశారు. విచారణలో బాలుడు లైంగిక దాడిని ప్రతిఘటించడంతోనే ఇటుకలతో కొట్టి చంపినట్లుగా నేరాన్ని అంగీకరించాడు. నిందితుడిపై లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణ (పోక్సో) చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (డిసిపి) రవి సింగ్ తెలిపారు.

ఇది కూడా చదవండి: India-US: భారతీయ కంపెనీలపై అమెరికా వేటు.. మోడీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందా?

Show comments