ఆప్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌పై కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేజ్రీవాల్‌కు నైతిక విలువలు ఉండుంటే.. అరెస్ట్ అయినప్పుడే రాజీనామా చేసేవారని వ్యాఖ్యానించారు. రాజ్‌నాథ్ సింగ్ ఓ మీడియా సంస్థతో మాట్లాడారు.
కేజ్రీవాల్‌కు నైతిక విలువలు ఉంటే ఆరోపణలు వచ్చిన రోజే కేజ్రీవాల్ రాజీనామా చేసేవారన్నారు. అంతేకాకుండా నిజం తేలేవరకు జైల్లోనే ఉండేవారని చెప్పారు. కానీ ఆయన అలా చేయలేదన్నారు. వచ్చే ఎన్నికల్లో ఢిల్లీలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని రాజ్‌నాథ్ సింగ్ ఆశాభావం వ్యక్తం చేశారు. అమెరికా పర్యటనలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై కూడా మండిపడ్డారు. విదేశాలకు వెళ్లిన రాహుల్ గాంధీ.. భారత్ ప్రతిష్ఠను దెబ్బతీశారన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారన్నారు. అయినప్పటికీ ప్రజల్లో మాత్రం మోడీ సర్కార్‌పై విశ్వాసం పెరుగుతూనే ఉందని స్పష్టం చేశారు.
ఇది కూడా చదవండి: Bahirbhoomi: సింగర్ నోయల్ హీరోగా కొత్త సినిమా.. వింత టైటిల్
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో కేజ్రీవాల్ అరెస్టై తీహార్ జైలుకు వెళ్లారు. ఆరు నెలల పాటు జైల్లో ఉన్నారు. ఇటీవల సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో జైలు నుంచి విడుదలయ్యారు. అనూహ్యంగా మంగళవారం ముఖ్యమంత్రి పదవికి కేజ్రీవాల్ రాజీనామా చేశారు. రిజైన్ లెటర్‌ను లెఫ్టినెంట్ గవర్నర్ సక్సేనాకు అందజేశారు. ఇక ఢిల్లీ తదుపరి ముఖ్యమంత్రిగా అతిషిని ఆప్ ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. త్వరలోనే అతిషిని ప్రమాణస్వీకారానికి లెఫ్టినెంట్ గవర్నర్ ఆహ్వానించనున్నారు.
ఇది కూడా చదవండి: Jani Master: ఆ అమ్మాయి కళ్ళు చూసి ఇష్టపడ్డా.. వైరల్ అవుతున్న జానీ మాస్టర్ పాత వీడియో