NTV Telugu Site icon

Rahul gandhi: పరువు నష్టం కేసులో వ్యక్తిగత హాజరుకు కోర్టు ఆదేశం

Aee;

Aee;

పరువునష్టం కేసులో కాంగ్రెస్ సీనియర్ నేత రాహల్ గాంధీకి ఉత్తరప్రదేశ్ కోర్టు తాజా ఆదేశాలు జారీ చేసింది. జూలై 2వ తేదీన వ్యక్తిగతంగా తమ ముందు హాజరుకావాలని ఎంపీ-ఎమ్మెల్యే కోర్టు బుధవారం ఆదేశించింది. కేంద్ర హోం మంత్రి అమిత్‌షాపై 2018లో రాహుల్ చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయంటూ బీజేపీ నేత విజయ్ మిశ్రా ఆయనపై పరువునష్టం కేసు వేశారు.

ఇది కూడా చదవండి: Nepal: నేపాల్‌ను ముంచెత్తిన వరదలు.. 20 మంది మృతి

‘భారత్ జోడో యాత్ర’ గత ఫిబ్రవరి 20న అమేథీకి చేరినప్పుడు కోర్టు ముందు రాహుల్ హాజరయ్యారు. దీంతో కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. కాగా ఈ కేసు తిరిగి విచారణకు రావడంతో రాహుల్‌ను వ్యక్తిగత హాజరు నుంచి మినహాయించాలని ఆయన తరఫు న్యాయవాది కాశీ ప్రసాద్ శుక్లా కోర్టును కోరారు. అయితే కోర్టు ఆయన విజ్ఞప్తిని తోసిపుచ్చుతూ తదుపరి విచారణకు రాహుల్ వ్యక్తిగతంగా హాజరుకావాలని ఆదేశించింది.

ఇది కూడా చదవండి: Kerala: రామ్‌దేవ్ బాబా, బాలకృష్ణకు కేరళ కోర్టు నోటీసులు.. దేనికంటే..!

Show comments