NTV Telugu Site icon

Rajnath Singh: కశ్మీర్లో ఉగ్రదాడిపై కేంద్ర రక్షణ శాఖ మంత్రి ఫైర్

Rajnath Singh

Rajnath Singh

Rajnath Singh: జమ్మూ కాశ్మీర్‌లోని కతువా జిల్లా మచెడి ప్రాంతంలో ఆర్మీ ట్రక్కుపై సోమవారం ఉగ్రవాదులు జరిపిన దాడిలో జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్ సహా ఐదుగురు జవాన్లు మరణించాగా.. మరో ఐదుగురు గాయపడడంతో వారిని పఠాన్‌కోట్ మిలటరీ ఆసుపత్రికి తరలించారు. ఉగ్రవాదులు ఆర్మీ వాహనాన్ని లక్ష్యంగా చేసుకుని గ్రెనేడ్‌తో కాల్పులు జరిపారని అధికారులు చెప్పుకొచ్చారు. కతువా నగరానికి 150 కిలోమీటర్ల దూరంలోని లోహై మల్హర్‌లోని బద్నోటా గ్రామ సమీపంలోని మాచెడి- కిండ్లీ- మల్హర్ రహదారిపై సైనిక వాహనం సాధారణ పెట్రోలింగ్‌లో ఉన్నప్పుడు ఈ సంఘటన చోటు చేసుకుందని పేర్కొన్నారు.

Read Also: India: రష్యా సైన్యంలో పని చేస్తున్న భారతీయులకు విముక్తి..?

అయితే, ఈ ఘటనపై కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ విచారం వ్యక్తం చేశారు. ఐదుగురు జవాన్లు మృతి చెందడం తనకు చాలా బాధ కలిగించిందని అన్నారు. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.. ఈ కష్టకాలంలో దేశం వారికి అండగా నిలుస్తుందని ఆయన చెప్పారు. ఈ ఉగ్రవాద దాడిలో గాయపడిన సైనికులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు రక్షణ మంత్రి తెలిపారు. ఇక, యాంటీ టెర్రరిజం ఆపరేషన్ కొనసాగుతోంది.. ఈ ప్రాంతంలో శాంతి భద్రతల పరిరక్షణకు భారత ఆర్మీ కట్టుబడి ఉందని రాజ్ నాథ్ సింగ్ చెప్పుకొచ్చారు.

Read Also: Gold Price in Hyderabad: మగువలకు శుభవార్త.. వరుసగా రెండోరోజు భారీగా తగ్గిన బంగారం ధరలు!

ఇక, ఈ దాడి తర్వాత ఉగ్రవాదులు సమీపంలోని అడవిలోకి పారిపోయారు. పోలీసులు, పారామిలటరీ సిబ్బంది సాయంతో సైన్యం ప్రతీకారం తీర్చుకుంటోంది. ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి. ఉగ్రదాడి చేసిన వారిని మట్టుబెట్టడానికి అదనపు భద్రతా బలగాలను వెంటనే ఆ ప్రాంతానికి పంపించారు. ముగ్గురు ఉగ్రవాదులు ఉన్నట్లు గుర్తించి ఇండియన్ ఆర్మీ.. వారు ఇటీవల సరిహద్దు దాటి వచ్చారని అనుమానిస్తున్నారు. నిషేధిత జైషే మహ్మద్ (జేఈఎం)తో సంబంధం ఉన్న పాకిస్థాన్‌కు చెందిన ‘కశ్మీర్ టైగర్స్’ ఈ దాడికి బాధ్యత వహిస్తున్నట్లు ప్రకటించింది.