Madhya Pradesh: మధ్యప్రదేశ్ లో విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. కరోనా సెకండ్ వేవ్ లో చనిపోయాడని అధికారుల చేత నిర్థారించబడిన వ్యక్తి రెండేళ్లకు సజీవంగా ఇంటికి రావడంతో అంతా షాక్ అయ్యారు. ఈ ఘటన ఆ కుటుంబాన్ని, సన్నిహితులను షాకింగ్ కు గురిచేయడంతో పాటు తమ వ్యక్తి సజీవంగానే ఉన్నాడని తెలుసుకుని అంతా సంతోషిస్తున్నారు.
Read Also: Amit Shah: “పైలట్ జీ మీ నంబర్ ఎప్పుడూ రాదు”.. రాజస్థాన్ కాంగ్రెస్ పోరుపై అమిత్ షా వ్యాఖ్యలు..
2021 లో కోవిడ్ -19 మహమ్మారి సెకండ్ వేవ్ లో కమలేష్ అనే వ్యక్తి మరణించినట్లు అధికారులు ప్రకటించారు. మధ్యప్రదేశ్ ధార్ జిల్లాకు చెందిన 30 ఏళ్ల కమలేష్ కరోనాతో మరణించాడని అధికారులు మృతదేహాన్ని బంధువులకు ఇవ్వకుండా స్పెషల్ ఆపరేటింగ్ విధానాల(ఎస్ఓపీ) ప్రకారం అంత్యక్రియలు నిర్వహించారు. ఇదిలా ఉంటే తాజాగా కమలేష్ రెండేళ్ల తర్వాత తన ఇంటికి చేరుకున్నాడు.
రెండేళ్లుగా తాను అహ్మదాబాద్ లో ఓ ముఠాతో కలిసి ఉన్నానని, ప్రతీ రోజూ తనకు మత్తు ఇంజక్షన్ ఇస్తున్నారని వెల్లడించాడు. కమలేష్ ను అతడి భార్య, కుటుంబ సభ్యులు గుర్తించారు. అయితే దీనిపై ధార్ జిల్లా అధికారులు విచారణ చేపట్టారు. బతికున్న వ్యక్తిని ఎలా చనిపోయారని ప్రకటించారనేదానిపై విచారణ జరుపుతున్నారు. మరణించిన వ్యక్తి ఎవరనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.