Site icon NTV Telugu

Doctor Death Case: వైద్యురాలి ఆత్మహత్యకు ముందు ఇంత జరిగిందా? వెలుగులోకి డెత్ మిస్టరీ

Doctor Death Case

Doctor Death Case

మహారాష్ట్రలో సంచలనం సృష్టించిన వైద్యురాలి ఆత్మహత్య కేసులో రోజురోజుకు కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా ఆత్మహత్యకు గల కారణాలను పోలీసులు అన్వేషించారు. దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.

ఇది కూడా చదవండి: Central Cabinet Decisions: బీహార్ ఎన్నికల వేళ అన్నదాతలకు కేంద్రం శుభవార్త

వైద్యురాలికి ఇంటి యజమాని కుమారుడు, సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ప్రశాంత్ బంకర్‌తో శారీరిక సంబంధం ఉంది. అయితే ఇంట్లో జరుగుతున్న లక్ష్మీ పూజకు యజమాని ఆహ్వానించాడు. ఈ లక్ష్మీ పూజకు వైద్యురాలు హాజరైంది. అయితే ఫొటోలు తీసుకునే విషయంలో ప్రశాంత్ బంకర్‌కు వైద్యురాలి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో కోపంతో వైద్యురాలు హోటల్‌కు వెళ్లిపోయింది. అదే రాత్రి ఫోన్‌లో ప్రశాంత్ బంకర్‌తో వాగ్యుద్ధం జరిగింది. అనంతరం హోటల్‌ గదిలో ఉరివేసుకుని వైద్యురాలు ప్రాణం తీసుకుంది.

ఇది కూడా చదవండి: Bus Accident: మరో బస్సు ప్రమాదం.. హైటెన్షన్ వైర్‌ తగిలి బస్సు దగ్ధం

అయితే వైద్యురాలు ఆత్మహత్యకు ముందు నాలుగు పేజీల సూసైడ్ నోట్ రాసింది. అందులో ఎస్‌ఐ గోపాల్ బద్నే, ఇంటి యజమాని కుమారుడు ప్రశాంత్ బంకర్ లైంగిక వేధింపులు, మానసిక క్షోభతో ప్రాణాలు తీసుకున్నట్లు రాసుకొచ్చింది. అంతేకాకుండా నకిలీ నివేదికలు ఇవ్వాలంటూ పోలీసు అధికారులు ఒత్తిడి చేశారని.. ఒక మాజీ ఎంపీ, అతడి సహచరులు కూడా ఒత్తిడికి గురి చేశారని ఆరోపించింది.

అయితే సంఘటనపై మహారాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ రూపాలి చకంకర్ కూడా విచారణ జరిపారు. విచారణ విషయాలను మీడియాకు వెల్లడించారు. ఎస్ఐ గోపాల్ బద్నేతో మార్చి వరకు శారీరిక సంబంధాలు ఉన్నాయని.. ఈ మధ్య కాలంలో ఎలాంటి సంబంధాలు లేనట్లుగా చెప్పారు. ఇంటి యజమాని కుమారుడు ప్రశాంత్ బంకర్‌తో వైద్యురాలు సంబంధం కొనసాగిస్తోందని వెల్లడించారు. లక్ష్మీ పూజ రోజున ఇద్దరి మధ్య ఫొటోలు సరిగ్గా తీయలేదని ఘర్షణ జరిగిందని.. అనంతరం ఆమె హోటల్‌కు వెళ్లి ఆత్మహత్య చేసుకుందని వివరించారు. నిందితులిద్దరి ఫోన్ కాల్స్‌ను పరిశీలించినట్లు పేర్కొన్నారు. మార్చి నుంచి ఎస్‌ఐతో ఎలాంటి కమ్యూనికేషన్ జరగలేదని చకంకర్ వెల్లడించారు.

ఈ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ.. మహారాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. సంస్థాగత హత్యగా పేర్కొన్నారు. రక్షించాల్సిన వాళ్లే భక్షించారంటూ ఆరోపించారు.

వైద్యురాలి మృతిపై ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయని ముఖ్యమంత్రి ఫడ్నవీస్ ఆరోపించారు. పోలీసులు వెంటనే నిందితులను అరెస్టు చేశారని.. కేసుకు సంబంధించిన అన్ని వాస్తవాలు బయటకు వస్తున్నాయని తెలిపారు. మా చెల్లెలికి న్యాయం జరిగే వరకు మేము మౌనంగా కూర్చోమని.. ప్రతి విషయంలోనూ కొంతమంది రాజకీయాలు చేయడానికి ప్రయత్నిస్తారని.. ఇది మా చెల్లెలి కేసు … ఎటువంటి రాజీ పడబోమని ముఖ్యమంత్రి ఫడ్నవీస్ పేర్కొన్నారు.

Exit mobile version