Site icon NTV Telugu

Dawood Ibrahim: కరాచీ ఎయిర్‌పోర్టును ఏలుతున్న అండర్ వరల్డ్ డాన్.. ఎన్ఐఏ సంచలన రిపోర్ట్

Dawood Ibrahim

Dawood Ibrahim

Dawood Ibrahim rules Karachi airport in Pakistan, reveals NIA: అండర్ వరల్డ్ డాన్, ఇండియా మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్ స్టర్ దావూద్ ఇబ్రహీం పాకిస్తాన్ లో రాచమర్యాదలు పొందుతున్నాడు. కరాచీ కంటోన్మెంట్ ఏరియాలో ఆర్మీ ఆధీనంలో ఉండే ప్రాంతంలో దావూద్ నివసిస్తున్నాడని ఎప్పటి నుంచో భారత్ చెబుతోంది. అయితే పాకిస్తాన్ మాత్రం దీన్ని తోసిపుచ్చుతూనే ఉంది. అయితే తాజాగా కేంద్రం దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. కరాచీ ఎయిర్ పోర్టును దావూద్ ఇబ్రహీం ఏలుతున్నాడని.. అక్కడ డీ-కంపెనీ మాఫియాకు ప్రత్యేక గౌరవం లభిస్తోందని ఎన్ఐఏ వెల్లడించింది. కరాచీ ఎయిర్ పోర్టులో వీరందరికి స్పెషల్ ట్రీట్మెంట్ ఉంటుందని తేలింది.

Read Also: Pinarayi Vijayan: రాజ్యాంగాన్ని కాపాడేందుకు.. బీజేపీకి వ్యతిరేకంగా పోరాడాలి

కరాచీ ఎయిర్ పోర్టు కేంద్రంగా దావూద్ అక్రమదందా సాగుతోందని ఎన్ఐఏ తేల్చింది. ఎయిర్ పోర్టులో చెక్-ఇన్, చెక్-అవుట్ సమయంలో ప్రత్యేక అధికారుల ఉంటున్నాయని, ఇమ్మిగ్రేషన్ కౌంటర్ కు వెళ్లాల్సిన అవసరం కూడా లేదని ఎన్ఐఏ దర్యాప్తులో తేలింది. దావూద్ తో పాటు ఛోటా షకీర్ ఉగ్రవాదులకు కరాచీ ఎయిర్ పోర్టులో ప్రత్యేక గుర్తింపు ఉందని తెలిపింది. 1993 ముంబైలో వరసగా 12 చోట్ల బాంబు పేలుళ్లు జరిగాయి. దీంట్లో కీలక నిందితుడిగా ఉన్నాడు దావూద్ ఇబ్రహీం. అప్పటి నుంచి పాకిస్తాన్ లో రక్షణ పొందుతున్నాడు.

ఇదిలా ఉంటే దావూద్ ఇబ్రహీం పాకిస్తాన్ పఠాన్ కు చెందిన అమ్మాయిని రెండో పెళ్లి చేసుకున్నట్లు తెలిసింది. దావూద్ ఇబ్రహీం సోదరి హసీనా పార్కర్ కుమారుడు అలీషా పార్కర్ విచారణలో ఎన్ఐఏ అధికారులకు ఈ విషయం వెల్లడించారు. దావూద్ ఇబ్రహీం మొదటి భార్యకు విడాకులు ఇచ్చాడనేది అబద్ధం అని వెల్లడించాడు. దావూద్ ఇబ్రహీం తన కుటుంబంతో సహా పాకిస్థాన్‌లోని కరాచీలోని అబ్దుల్లా గాజీ బాబా దర్గా వెనుక రక్షణ ప్రాంతంలో నివసిస్తున్నాడని ఆయన పేర్కొన్నారు. దావూద్ ఇబ్రహీం మొదటి భార్య మైజాబిన్. వీరిద్దరికి ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నాడు. మొదటి కుమార్తె మారుఖ్ ను ప్రముఖ మాజీ క్రికెటర్ జావేద్ మియాందాద్ కుమారుడు జునైద్ కు ఇచ్చి పెళ్లి చేశాడు. మరో కుమార్తెతో పాటు కుమారుడికి కూడా వివాహం అయింది.

Exit mobile version