Dawood Ibrahim: దావూద్ ఇబ్రహీం ఇక్కడే ఉంటున్నాడా.. ధురంధర్‌లో చూపించింది నిజమేనా?
- దావూద్ ఇబ్రహీం కరాచీలోనే ఉంటున్నాడా.?
- ధురంధర్ 2లో చూపించిందని నిజమేనా..?
- భద్రతా ఏజెన్సీలు ఏం చెబుతున్నాయి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dawood Ibrahim: దావూద్ ఇబ్రహీం, ఇండియాలో పరిచయం అక్కరలేని పేరు. ఇండియాలో పుట్టి పెరిగి అండర్ వరల్డ్ డాన్‌గా ఎదిగిన ఇతడు భారత మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది. 90లలో ముంబై టెర్రర్ దాడులకు కీలక సూత్రధారి. ఈ ఘటన తర్వాత నుంచి తన మకాంను పాకిస్తాన్ మార్చాడు. అక్కడి నుంచే తన ‘‘డి-గ్యాంగ్’’ను ఆపరేట్ చేస్తున్నాడు. పాకిస్తాన్‌లో ఐఎస్ఐ, పాక్ ఆర్మీ రక్షణలో దావూద్ ఇబ్రహీం ఉన్నట్లు అందరికి తెలుసు.
మరోసారి ‘‘ధురంధర్ 2’’ సినిమాలో బడే సాహెబ్ పేరుతో దావూద్ ఇబ్రహీం సీన్స్ వైరల్ అయ్యాయి. అయితే, కరాచీలోని అత్యంత కట్టుదిట్టమైన, లగ్జరీ ప్రాంతమైన 13 క్లిఫ్టన్ రోడ్ ప్రాంతంలో దావూద్ నివసిస్తున్నట్లు మన ఇంటెలిజెన్స్ ఏజెన్సీలకు కూడా సమాచారం ఉంది. ధురంధర్ సినిమాలో దావూద్ ఇంటిపై వైట్ హౌజ్, 13 క్లిఫ్టన్ రోడ్, కరాచీ అని ఉంటుంది. ఈ ఇంటిలోనే మాఫియా డాన్ ఉంటున్నట్లు సినిమాలో చూపిస్తారు.
Also Read
- Smit Machchhar: భారత పైలట్‌కు ఘన గౌరవం.. ఇజ్రాయెల్‌లో మారుమోగుతున్న మచ్చర్ పేరు!
- Election Commission: ఎన్నికల సంఘంలో విభేదాలపై సంచలనం.. ‘‘అన్ని నిర్ణయాలు ఏకగ్రీవమే’’..
- Flydubai Heroes: పైలట్, ప్లంబర్, డెంటిస్ట్, బిజినెస్ మ్యాన్, బ్యాంకర్.. ఫ్లైదుబాయ్ ఘటనలో హీరోలు వీరే..
- PM Modi: ‘ప్రభుత్వమే మై-బాప్’ నుంచి ‘పౌరుడి సేవకు ప్రాధాన్యత’ వైపు.. UPSC శతాబ్ది వేడుకల్లో ప్రధాని మోడీ కీలక సందేశం
నిజంగా కరాచీలోనే దావూద్ ఉన్నాడా?
క్లిఫ్టన్‌లోని వైట్ హౌజ్ 13, సౌదీ మసీదుకు సమీపంలో ఉంతటుంది. క్లిఫ్టన్ బీచ్ సుమారుగా కిలోమీటర్ దూరంలో ఉంటుంది. కరాచీలోనే క్లిఫ్టన్ అత్యంత సంపన్నమైన ఏరియా. ఈ ఏరియాలో పాకిస్తాన్ ఆర్మీ అధికారులు, రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు ఉంటారు. ఇది కరాచీలోనే అత్యంత ఖరీదైన రియల్ ఎస్టేట్ ప్రాంతం. ఇక్కడే అనేక విదేశీ కాన్సులేట్స్ ఉంటాయి. కరాచీలోని ప్రముఖ వాణిజ్య కేంద్రాలు ఈ ఏరియాలో ఉంటాయి. ఈ ప్రాంతంలోనే దావూద్ ఇబ్రహీం ఉన్నట్లు చాలా మంది భావిస్తుంటారు. అయితే, కరాచీలోని అత్యంత విలాసవంతమైన కాలనీలో ఒకటైన డిఫెన్స్ హౌసింగ్ ఏరియా(DHA), ఫేజ్ Vలో దావూద్ ఇబ్రహీంకు ఒక ఇల్లు ఉందని కూడా నమ్ముతారు. భారత నిఘా వర్గాలు కూడా ఈ రెండు ఏరియాల్లోనే దావూద్ ఉంటున్నట్లు నమ్ముతాయి.
అయితే, 2024 నాటి సండే గార్డియన్ నివేదిక ప్రకారం… ముంబై వరస బాంబు పేలుళ్ల నిందితుడైన దావూద్ ఇబ్రహీం తన సోదరుడు అనీస్ ఇబ్రహీంతో కలిసి కరాచీలోని ఖయ్యూమాబాద్ సెక్టార్ బి-ఫేజ్ 5, స్ట్రీట్ నంబర్ 30లో ఉన్న రెండు వేర్వేరు విల్లాల్లో ఉంటున్నారు. దావూద్ ,అతని కుటుంబం ఉపయోగిస్తున్న ఆ రెండు విల్లాలు హౌస్ నంబర్ 20 మరియు 21, ఈ ఇళ్లు చైనా కాన్సులేట్‌కు కేవలం 700 మీటర్ల దూరంలో ఉన్నాయని చెప్పింది.
1992 ముంబై దాడుల తర్వాత భారత్ నుంచి పారిపోయి వచ్చిన దావూద్ ఇబ్రహీం కరాచీలోని ఖయ్యూమాబాద్‌లో నివసిస్తున్నట్లు చెప్పింది. దావూద్ చాలా అరుదుగా ఇంటి నుంచి బయటకు వస్తాడని, ఎప్పుడు సాయుధ రక్షణ బలగాల రక్షణలో ఉంటాడని నివేదిక చెబుతోంది. దావూద్ స్వయంగా పిలిస్తే తప్పా, సొంత కుటుంబ సభ్యులకు కూడా అతడి రూంలోకి అనుమతి లేదు. మెడికల్ అవసరాలు ఉన్నప్పుడు మాత్రమే అతను బయటకు వెళ్తాడని నివేదికలు చెబుతున్నాయి.
తాజావార్తలు
-
US Crime: ప్రెగ్నెంట్ కూతురి హత్య కేసులో సంచలనం.. కాబోయే అల్లుడితో తల్లికి లైంగిక సంబంధం!
-
Krishna: ఇండస్ట్రీని రెండుగా చీల్చాలని చూస్తే ఊరుకోం.. జానీ మాస్టర్ భార్యపై ప్రొడక్షన్ ప్రెసిడెంట్ ఫైర్!
-
Film Federation: ఫెడరేషన్ అధ్యక్షుడిపై విమర్శలపై 23 క్రాఫ్ట్స్ సీరియస్
-
Naga Vamsi: డౌట్లు ఉంటే తీసేయండి.. నాగవంశీ మార్క్ స్టేట్మెంట్తో గురూజీ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్!
-
Danam Nagender: ఖైరతాబాద్ ఓట్లపై దానం ఫైర్.. హైదరాబాద్ తగలబడిపోతుంది.!
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?