NTV Telugu Site icon

రెండో పెళ్లి చేసుకున్న తల్లి.. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పెట్టిన కూతురు

wedding

కాలం మారుతోంది.. అంతకుముందులా ఇప్పుడు యువత లేదు.. ప్రతిదాన్ని మనసుతో ఆలోచిస్తుంది . తల్లి చనిపోతే తండ్రి రెండో పెళ్లి చేసుకొంటే తప్పులేనప్పుడు.. తండ్రి చనిపోతే తల్లి ఎందుకు రెండో పెళ్లి చేసుకోకూడదు అని ప్రశ్నిస్తున్నారు కొంతమంది యువత.. తల్లికి తోడుగా తనకిష్టమైన ప్రేమను వెతికి పెడుతున్నారు. తాజాగా ఒక కూతురు తన తల్లికి రెండో పెళ్లి చేసింది. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంటూ ఎమోషనల్ అయ్యింది. ప్రస్తుతం ఆ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.

వివరాలలోకి వెళితే.. ఒక 45 ఏళ్ళ మహిళ కు కొన్నేళ్ల క్రితం భర్త చనిపోయాడు. ఆమెకు పెళ్లీడుకు వచ్చిన కూతురు , 16 ఏళ్ళ కొడుకు ఉన్నారు. ఇక ఇటీవల తల్లి తాను రెండో పెళ్లి చేసుకోవాలనుకుంటానని, మీ అనుమతి కావాలని పిల్లలను అడిగింది. దానికి పిల్లలు మంచి మనసుతో సరే అనడంతో ఆ ఇంట పెళ్లి భాజాలు మోగాయి . తల్లికి తోడు అవసరమని తెలుసుకున్న ఆ పిల్లలు తమ ఆనందాలను పక్కనపెట్టి తల్లికి దగ్గర ఉండి పెళ్లి చేశారు.

కూతురు అయితే ఏకంగా తల్లి రెండో పెళ్లిని లైవ్ స్ట్రీమింగ్ చేసి మురిసిపోయింది. దగ్గర ఉండి మెహందీ, హల్దీ , పెళ్లి కూతురు వేడుక చేయించి ఆ ఫోటోలను ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. ” నా తల్లి ఎంతో ఆనందంగా ఉంది .. తాను ఒక ఇంటిది కావడం సంతోషంగా ఉంది.. అమ్మ పెళ్లి చేసుకొంటోంది అంటే నమ్మలేకపోతున్నా.. ఆమె నిర్ణయాన్నీ నేను , నా తమ్ముడు ఎల్లప్పుడూ గౌరవిస్తాం” అంటూ చెప్పుకొచ్చింది. ఇక ఈ ఫోటోలు చూసిన నెటిజన్స్ ఇద్దరు పిల్లలను మెచ్చుకొంటున్నారు. తల్లి ఆనందాన్ని తిరిగి ఇచ్చారు .. మీరెప్పుడు సంతోషంగా ఉండాలని కొందరు.. మీ కుటుంబంలోకి వస్తున్నా నూతన వ్యక్తికి స్వాగతం అంటూ మరికొందరు కామెంట్స్ పెడుతున్నారు.