Site icon NTV Telugu

Mysuru Suicide: ప్రియుడితో వెళ్లిపోయిన కూతురు.. చెరువులో దూకి కుటుంబం ఆత్మహత్య..

Mysuru Suicide

Mysuru Suicide

Mysuru Suicide: కర్ణాటక రాష్ట్రం మైసూరు తీవ్ర విషాదకర సంఘటన చోటు చేసుకుంది. కూతురి ప్రేమ కుటుంబాన్నే బలి తీసుకుంది. అల్లారుముద్దుగా పెంచుకున్న కూతురు ప్రేమించిన వ్యక్తితో వెళ్లిపోయిందని కుటుంబం మొత్తం ఆత్మహత్యకు పాల్పడింది. తల్లిదండ్రులతో పాటు చిన్న కూతురు హెబ్బల్హా జలాశయంలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మైసూరు జిల్లా హెచ్‌డీ కోటే తాలూకా బూదనూరు గ్రామంలో జరిగిన ఈ సంఘటన అందరిచేత కంటతడి పెట్టిస్తోంది.

Read Also: Nishikant Dubey: కాంగ్రెస్ భారత్ భూభాగాన్ని పాకిస్తాన్‌కి ఇచ్చింది.. ఇందిరా గాంధీపై విమర్శలు..

మృతులను మహాదేవ్ స్వామి (55), మంజుల (45) మరియు వారి చిన్న కుమార్తె హర్షితలుగా గుర్తించారు. వీరంతా బుదనూర్ గ్రామ నివాసితులు. శనివారం ఉదయం జలాశయం వద్ద చెప్పులు, బైక్, సూసైడ్ నోట్‌ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ ప్రదేశం గుండా ప్రయాణిస్తున్న పలువురు గ్రామస్తులు బైక్‌ని గమనించి, దగ్గరగా వచ్చి చూడటంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను బయటకు తీశారు.

ఇటీవల, మహాదేవ్ స్వామి,మంజుల దంపతుల పెద్ద కుమార్తె అర్పిత ప్రేమించిన వ్యక్తితో వెళ్లిపోయి పెళ్లి చేసుకుంది. తమ కుమార్తె కారణంగానే వీరంతా ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు నిర్ధారించారు. ఈ విషయంపై మరింత దర్యాప్తు చేస్తున్నట్లు సీనియర్ పోలీస్ అధికారి వెల్లడించారు.

Exit mobile version