Site icon NTV Telugu

Monkey Pox : వ్యాప్తిస్తోన్న మంకీపాక్స్‌.. ఇండియాలో కూడా..

Monkeypox

Monkeypox

కరోనా వైరస్‌తోనే కొట్టుమిట్టాడుతున్న ప్రజలపై మంకీపాక్స్‌ రూపంలో మరో వైరస్‌ విరుచుకుపడుతోంది. అయితే.. ఈ వైరస్‌ చిన్నారులను టార్గెట్‌ చేస్తుండటం ఆందోళన కలిగించే విషయం. రోజు రోజుకు మంకీ పాక్స్‌ కేసులు దేశాలకు వ్యాప్తి చెందుతోంది. ఇప్పటి వరకు ఈ వైరస్ 27 దేశాలకు విస్తరించింది. 27 దేశాల్లో మొత్తం 780 మంకీపాక్స్ కేసులు నమోదయినట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ప్రకటించింది. మే 13వ తేదీ నాటికి ప్రపంచ వ్యాప్తంగా 257 కేసులు బయటపడగా… ఈ నెల 2వ తేదీ వరకు 780 కేసులు నిర్ధారణ అయ్యాయని డబ్ల్యూహెచ్‌వో పేర్కొంది.

మంకీపాక్స్ వల్ల ఈ ఏడాదిలో 7 దేశాల్లో 66 మంది మృతి చెందారని డబ్ల్యూహెచ్‌వో ప్రకటించింది. మన దేశంలో కూడా మంకీపాక్స్ భయాందోళనలను కలిగిస్తోంది. యూపీలోని ఘజియాబాద్ లో ఐదేళ్ల చిన్నారిలో మంకీపాక్స్ లక్షణాలు కనిపించడం స్థానికంగా ఆందోళన కలిగిస్తోంది. బాలిక శరీరంపై దద్దుర్లు, దురద ఉన్నట్టు గుర్తించిన వైద్యులు ఆమె శాంపిల్స్ ను పూణేలోని ల్యాబ్ కు పరీక్ష కోసం పంపించారు. బాలికలో మంకీపాక్స్ లక్షణాలు కనిపించడంతో అప్రమత్తమయ్యారు వైద్యులు.

Exit mobile version