Site icon NTV Telugu

Cyclone Shakhti: అరేబియా సముద్రంలో తీవ్ర తుఫాన్.. బీభత్సం సృష్టించే అవకాశం

Cyclone Shakhti

Cyclone Shakhti

అరేబియా సముద్రంలో తీవ్రమైన ‘శక్తి’ తుఫాన్ ఏర్పడింది. ప్రస్తుతం తీరం వైపునకు దూసుకొస్తోందని కేంద్ర వాతావరణ శాఖ తెలిపింది. 420 కి.మీ దూరంలో తుఫాన్ కేంద్రీకృతమైనట్లుగా పేర్కొంది. గుజరాత్, పశ్చిమ-నైరుతి దిశగా తుఫాన్ కదులుతోందని వెల్లడించింది.

ఇది కూడా చదవండి: Italy: ఇటలీ విహారయాత్రలో విషాదం.. నాగ్‌పూర్‌కు చెందిన దంపతుల మృతి

ఈ తుఫాన్ కారణంగా ముంబైలో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. ఇక 100 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని స్పష్టం చేసింది. అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. రుతుపవనాల తర్వాత అరేబియా సముద్రంలో ఏర్పడిన తొలి తుఫాన్ ఇదేనని చెప్పింది. గుజరాత్ తీరంలో తుఫాన్ ప్రభావం ఎక్కువగా ఉంటుందని వెల్లడించింది. సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని.. అలలు భారీ స్థాయిలో ఎగిసిపడతాయని తెలిపింది. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని.. ప్రభావిత ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

ఇది కూడా చదవండి: Singer Zubeen Garg: జుబీన్ గార్గ్ కేసులో బిగ్ ట్విస్ట్! అనుమానాలే నిజమయ్యాయి!

సోమవారం ఉదయం తూర్పు-ఈశాన్య దిశగా తిరిగి శక్తి తుఫాన్ బలహీనపడుతుందని చెప్పింది. గుజరాత్, ఉత్తర మహారాష్ట్ర, పాకిస్థాన్ తీరం వెంబడి పరిస్థితులు ఉధృతంగా ఉంటాయని అంచనా వేసింది. ఇక ముంబై, థానే, పాల్ఘర్, రాయ్‌గడ్, రత్నగిరి, సింధుదుర్గ్‌లో అక్టోబర్ 7వరకు భారీ వర్షాలు, బలమైన గాలులు వీచే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది.

ఇది కూడా చదవండి: CJI Gavai: న్యాయ వ్యవస్థ బుల్డోజర్లతో కాదు.. చట్టబద్ధంగా సాగుతోంది.. సీజేఐ గవాయ్ కీలక వ్యాఖ్యలు

Exit mobile version