NTV Telugu Site icon

Fengal Cyclone: 3-4 గంటల్లో తీరం దాటనున్న ఫెంగల్ తుఫాన్.. బీభత్సం సృష్టించే ఛాన్స్

Fengalcyclone

Fengalcyclone

ఫెంగల్ తుఫాన్ తీరం వైపు దూసుకొస్తోంది. దాదాప 3-4 గంటల్లో ఫెంగల్ తుఫాన్ తీరం దాటే అవకాశం ఉందని కేంద్ర వాతావరణ శాఖ తెలిపింది. తుఫాను త్వరలో బలహీనపడి నవంబర్ 30 నాటికి తమిళనాడు-పుదుచ్చేరి తీరాల్లో తీవ్ర అల్పపీడనంగా మారుతుందని భారత వాతావరణ శాఖ తెలిపింది. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం 3 కిలోమీటర్ల వేగంతో ఉత్తర వాయువ్య దిశగా నెమ్మదిగా కదులుతున్నట్లు ఐఎండీ తెలిపింది. నాగపట్టినానికి ఆగ్నేయంగా 320 కి.మీ, పుదుచ్చేరికి ఆగ్నేయంగా 420 కి.మీ మరియు చెన్నైకి ఆగ్నేయంగా 500 కి.మీ దూరంలో తుఫాన్ కేంద్రీకృతమైంది.

ఇది కూడా చదవండి: Pushpa 2 Bookings: ఇది సార్ పుష్ప గాడి బ్రాండు.. షేకయ్యేలా అడ్వాన్స్ బుకింగ్స్

ఇదిలా ఉంటే తుఫాన్ ప్రభావంతో ఇప్పటికే తమిళనాడులోని పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. చెన్నైలో కుండపోత వర్షం కురుస్తోంది. భారీ ఈదురుగాలుల కారణంగా చెట్లు కూలిపోయాయి. విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో అంధకారంలోకి వెళ్లిపోయాయి. ఇక పలు కాలనీలు నీళ్లతో నిండిపోయాయి.

ఇది కూడా చదవండి: Producers : బోర్డర్స్ చెరిపేస్తోన్న స్టార్ ప్రొడ్యూసర్స్.. పక్క ఇండస్ట్రీలో భారీ పెట్టుబడులు

తిరువారూర్ జిల్లాలో 1,500 ఎకరాల్లో వరి పంట దెబ్బతిన్నట్లు వస్తున్న వార్తలపై అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి కె పళనిస్వామి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు, అధికారులు వర్షాభావ ప్రాంతాలను పరిశీలించి రైతులకు తగిన సాయం అందించాలని డిమాండ్ చేశారు. పుదుచ్చేరి సమీపంలో మహాబలిపురం-కరైకాల మధ్య కొండచరియలు విరిగిపడ్డాయి. ఇదిలా ఉంటే తుఫాన్ కారణంగా స్కూళ్లు, కాలేజీలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించాయి.

ఇది కూడా చదవండి: Satpal Singh Arora: 81 ఏళ్ల విద్యార్థి.. ఈ వయసులో న్యాయశాస్త్రం చదవుతున్న తాతకు సలాం!