Site icon NTV Telugu

చెన్నై ఎయిర్‌పోర్ట్‌లో భారీగా డైమండ్స్ పట్టివేత

తమిళనాడులోని చైన్నై ఎయిర్‌పోర్టులో భారీగా డైమండ్స్‌ను పట్టుకున్నారు కస్టమ్స్‌ అధికారులు. ఓ దుబాయ్‌ ప్రయాణీకుడి వద్ద నుంచి 5.76 కోట్ల విలువ చేసే వజ్రాలను కస్టమ్స్‌ అధికారులు సీజ్‌ చేశారు. ఆ ప్రయాణికుడిని అరెస్టు అధికారులు అరెస్టు చేశారు. కస్టమ్స్ అధికారులకు ఏమాత్రం అనుమానం రాకుండా వజ్రాలను ట్రాలీ బ్యాగ్‌ కింది భాగంలో దాచి, వజ్రాలను దాచిన ట్రాలీ బ్యాగ్‌తో దుబాయ్‌కు వెళ్లేందుకు యత్నించిన ప్రయాణికుడు. ఎయిర్‌పోర్ట్‌లో కస్టమ్స్ అధికారుల స్కానింగ్‌లో బండారం బట్టబయలైంది.

Read Also:174 పరుగులకు భారత్ ఆలౌట్

దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న కస్టమ్స్ అధికారులు. కాగా ఇటీవల ఎయిర్‌ పోర్టులో భారీగా డ్రగ్స్‌ సహా ఇతర విలువైన వస్తువులు పట్టుబడుతుండటం అటు అధికారులను కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ అక్రమ రవాణా ఏదో విధంగా చేయడానికి దుండగులు ప్రయత్నిస్తునే ఉన్నారు. ఈ నేపథ్యంలో ఎయిర్‌పోర్టుల్లో మరిన్ని కట్టుదిట్టమైన భద్రత చర్యలు పాటించాల్సిన అవసరం ఉంది.

Exit mobile version