NTV Telugu Site icon

PM MODI: హిందువులను తిట్టడం ఫ్యాషన్ అయింది.. రాహుల్ వ్యాఖ్యలపై పీఎం వార్నింగ్..

Pm Modi

Pm Modi

PM MODI: రాహుల్ గాంధీ హిందువులపై చేసిన వ్యాఖ్యలపై ప్రధాని నరేంద్రమోడీ ఈ రోజు లోక్‌సభలో విరుచుకుపడ్డారు.హిందువులపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యల్ని దేశాన్ని ఎప్పుడూ మరిచిపోదని అన్నారు. హిందువులది హింసాత్మక వైఖరి అంటారా.. ఇదేనా మీ సంస్కారం అని ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందువులను పరంపర, దేశ సంస్కృతిని దిగజార్చాలని చూస్తున్నారని, హిందువులపై కించపరచడం ఫ్యాషన్‌గా మారిందని దుయ్యబట్టారు. హిందువులను ఉగ్రవాదులుగా చూపేందుకు ఒక ఎకోసిస్టమ్ ప్రయత్నిస్తోందని ప్రధాని మోడీ ఆరోపించారు. వీటిని సహించేది లేదని చెప్పారు. హిందువులు ఆరాధించే శక్తిని కూడా కించపరాచాలని కాంగ్రెస్ యత్నించిందని అన్నారు. హిందువులు సహనజీవులు అని అన్నారు. దీని వల్లే భారత్‌ ప్రజాస్వామ్యం, వైవిధ్యం కొనసాగుతోందని చెప్పారు. పార్లమెంట్‌లో శివుడి పోస్టర్‌ని రాహుల్ గాంధీ ప్రదర్శించడంపై మాట్లాడుతూ.. శివుడి రూపం పూజించడానికని, ప్రదర్శించడానికి కాదని ప్రధాని మోడీ అన్నారు.

Read Also: UP Stampede: ఘోర విషాదం.. యూపీ తొక్కిసలాటలో 107 పైగా మృతి..

హిందువులపై రాహుల్ గాంధీ సభలో చేసిన వ్యాఖ్యలపై దేశ ప్రజలు ఆలోచించాలని ప్రధాని కోరారు. కాంగ్రెస్ మిత్రులు హిందూ మతాన్ని మలేరియాలో పోలిస్తే చప్పట్లు కోడుతున్నారని పరోక్షంగా డీఎంకేని దుయ్యబట్టారు. రాహుల్ గాంధీ చెప్పేవి అన్ని అబద్ధాలే అని అన్నారు. రిజర్వేషన్లు, అగ్నివీర్, ఎంఎస్పీ, అకౌంట్లలో రూ. 8500 అన్ని అబద్ధాలని చెప్పారు. నెహ్రూ దళితులు, వెనకబడిన వారికి అన్యాయం చేశారని అన్నారు. బాబా సాహెబ్ అంబేద్కర్‌ని దళితుడనే వివక్షతో చూడడంతోనే కేబినెట్ నుంచి బయటకు వచ్చినట్లు చెప్పారని ప్రధాని మోడీ చెప్పారు. కాంగ్రెస్‌ది అభయహస్తం కాదని అరాచక హస్తమని చెప్పారు. జగ్‌జీవన్ రామ్, చరణ్ సింగ్, సీతారం కేసరిని కాంగ్రెస్ విస్మరించిందని చెప్పారు. అగ్నివీర్‌పై అబద్ధాలు ప్రచారం చేసి మన సైనికుల స్థైర్యాన్ని దెబ్బతీయాలని చూస్తున్నాయని చెప్పారు.