Site icon NTV Telugu

UP: వివాహ వేడుకలో నిర్లక్ష్యం.. టపాసులు పేలి పెళ్లి కారు దగ్ధం.. వీడియో వైరల్

Up

Up

ఉత్తరప్రదేశ్‌ సహరాన్‌పూర్‌లోని ఓ వివాహ వేడుకలో అపశృతి చోటుచేసుకుంది. పెళ్లి ఊరేగింపు జరుగుతుండగా బంధువులు నిర్లక్ష్యంగా టపాసులు పేల్చారు. దీంతో క్రాకర్స్ కారులో పడడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. కారులో ఉన్న క్రాకర్స్ ఒక్కసారిగా పేలడంతో కారు దగ్ధమైంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇది కూడా చదవండి: Minister Seethakka: నిర్మల్ ప్రజలకు కేటీఆర్ క్షమాపణ చెప్పాలి.. ఇథనాల్ ఫ్యాక్టరీ అంశంపై మంత్రి సంచలన వ్యాఖ్యలు

సహరాన్‌పూర్‌లో సందడిగా పెళ్లి ఊరేగింపు జరుగుతోంది. ఇంతలో నిర్లక్ష్యంగా బాణసంచా కాల్చారు. పెళ్లి కారు సన్‌రూఫ్‌లో క్రాకర్స్ పడడంతో క్షణాల్లో మంటలు చెలరేగాయి. అందులో ఉన్న వారు మంటల్లో చిక్కుకున్నారు. అతి కష్టం మీద అందులోంచి బయటపడ్డారు. ఈ ఘటనలో ఇద్దరికి గాయాలయ్యాయి. బాధితులను ఆస్పత్రికి తరలించారు. ఇందుకు సంబంధించి వీడియో వైరల్ అవుతోంది. ఈ పెళ్లి ఊరేగింపు తర్వాత వరుడు డెహ్రాడూన్‌కు వెళ్లాల్సి ఉంది. అదృష్టవశాత్తూ ఇద్దరు యువకులు ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. ప్రస్తుతం ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

ఇది కూడా చదవండి: Minister Narayana: అమరావతికి రైల్వే లైన్.. రైతులకు మంత్రి హామీ

 

Exit mobile version