దేశంలో అంతా మోడీ మహల్ సేల్ నడుస్తుందని.. అన్నిటినీ అందులో అమ్మకానికి పెట్టారంటూ సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యురాలు బృందా కారత్ విమర్శలు గుప్పించారు. శనివారం ఆమె మాట్లాడుతూ.. ఇదంతా ప్రజల సంపద.. మోడీ అయ్య జాగీరు కాదు అమ్మడానికి అంటూ తీవ్రంగా ధ్వజమెత్తారు. మోడీ హవా నడుస్తుంది మనం ఏం చేయగలం అనుకోకండి.. రైతులు ఢిల్లీ నీ ముట్టడించి.. చట్టాలు వెనక్కి తెచ్చేలా చేయలేదా..? మనం చూడలేదా ..? అని ఆమె మాట్లాడారు.
తెలంగాణలో పొడు భూముల పోరాటం లో జైలుకు వెళ్ళిన అదిలాబాద్ బిడ్డలకు సలాం అని ఆమె అన్నారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె కు సలాం, జనం కి మేలు చేయని ఏ ప్రభుత్వం మీద అయినా పోరాటం చేయండి అంటూ ఆమె పిలుపునిచ్చారు. ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉన్న చోట ప్రజలకు అన్యాయం జరిగితే ప్రజలకు అండగా ఉండండి అని ఆమె వ్యాఖ్యానించారు. మోడీ పాలనకు రోజులు దగ్గర పడ్డాయని, వచ్చే ఎన్నికలల్లో బీజేపీకి ప్రజలు తగిన బుద్ది చెబుతారన్నారు.
