NTV Telugu Site icon

CPI Narayana: ఇదే జరగకుంటే కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా కమ్యూనిస్టులు ఉండేవారు.

Cpi Narayana

Cpi Narayana

CPI Narayana criticizes BJP party: జీ-20 నాయకత్వం వహించే అవకాశం భారతదేశానికి రొటేషన్ లో భాగంగా వచ్చింది. కానీ ప్రధాని నరేంద్ర మోదీ ఉండటం వల్లే అన్నట్టుగా ప్రచారం చేసుకుంటున్నారని బీజేపీపై విమర్శలు గుప్పించారు సీపీఐ జాతీయ నేత నారాయణ. సైద్ధాంతికంగా బీజేపీ వ్యతిరేకించినప్పటికీ ఇవాళ్టి సమావేశంలో డీ. రాజా పాల్గొంటున్నారని అన్నారు. జీ 20 సదస్సులో మహిళా సాధికారత అనే అంశం ఉందని.. దేశంలో మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించకుండా ఈ అంశంపై మాట్లాడే నైతిక అర్హత భారతదేశానికి ఉండదని అన్నారు. పూర్తి మెజారిటీతో అధికారంలో ఉన్న బీజేపీ ఈ బిల్లును పాస్ చేయాలని డిమాండ్ చేశారు.

Read Also: Revanth Reddy: నన్ను జైల్లో పెట్టి.. నా బిడ్డ లగ్నపత్రికకు పోకుండా చేశారు

గవర్నర్ల వ్యవస్తను దుర్వినియోగం అంశంపై మా పార్టీ చర్చించిందని.. వందేళ్ల సీపీఐ ప్రమాణంలో భాగంగా పార్టీ సభ్యత్వ నమోదు చేపడతాం అని అన్నారు. 10 లక్షల సభ్యత్వాలను చేపట్టాలని టార్గెట్ పెట్టుకున్నట్లు వెల్లడించారు. రాజ్యాంగ వ్యవస్థలను రక్షించేందుకు పోరాటాలు చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ఒకప్పుడు పార్లమెంట్ లో కమ్యూనిస్టులకు 60కి పైగా స్థానాలు ఉండేవని.. ప్రాంతీయ వాదం, మతతత్వం, డబ్బు ప్రభావం పెరిగిందని అన్నారు. కమ్యూనిస్టుల ప్రభావం తగ్గడానికి ఇదే కారణం అని అన్నారు.

కమ్యూనిస్టు పార్టీల చీలిక ప్రాంతీయ పార్టీలకు ఊతమిచ్చిందని..కమ్యూనిస్టుల బలహీనతల వల్లే ప్రాంతీయ పార్టీలు పుట్టుకొచ్చాయని ఆయన అన్నారు. లేకుంటే కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా కమ్యూనిస్ట్ పార్టీలే నిలబడేవని కమ్యూనిస్టుల పునరేకీకరణ జరగాల్సిన అవసరం ఉందని అన్నారు. రాజకీయాలు వ్యాపారమయం అయ్యాయని..కాబట్టి ఒకరిద్దరు కమ్యూనిస్టులు పార్టీ వీడే అవకాశం ఉండొచ్చని అన్నారు. కానీ ప్రజా ఉద్యమాల నిర్మాణంలో కమ్యూనిస్టులు నేటికి బలంగా ఉన్నారని అన్నారు.