Covid vaccine: ఇటీవల కాలంలో పెరుగుతున్న గుండెపోటు మరణాలకు కోవిడ్ వ్యాక్సిన్‌కి సంబంధం ఉందనే వార్తల నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా క్లారిటీ ఇచ్చారు. గుండెపోటుకు కోవిడ్ వ్యాక్సిన్‌లు కారణం కాదని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్) నిర్వహించిన అధ్యయనాన్ని ఉటంకిస్తూ మాండవియా శనివారం తెలిపారు. ఏఎన్ఐ డైలాగ్స్ 2024లో ఆయన మాట్లాడుతూ.. ఈ రోజు ఎవరికైనా స్ట్రోక్ వచ్చినట్లయితే, అది కోవిడ్ వ్యాక్సిన్ వల్లే అనే భావిస్తున్నారు, గుండెపోటుకు కోవిడ్ వ్యాక్సిన్ కారణం కానది ఐసీఎంఆర్ ఒక వివరణాత్మక అధ్యయనం తెలియజేసిందని అన్నారు.
Read Also: Harirama Jogaiah: పవన్‌కు మళ్లీ జోగయ్య లేఖ.. ఈసారి ఏం సలహా ఇచ్చారంటే!
గుండెపోటుకి జీవనశైలి, పొగాకు, మద్యపానం వంటి అనేక కారణాలు ఉన్నాయని ఆయన తెలిపారు. కొన్ని సార్లు తప్పుడు సమాచారం ప్రజల్లోకి వ్యాపిస్తుందని, కొంత సమయం తర్వాత అవగాహన వస్తుందని మాండవియా అన్నారు. కోవిడ్ వ్యాక్సిన్ కారణంగా యువకుల్లో హార్ట్ ఎటాక్ కేసులు పెరుగుతున్నాయనే వార్తలు వ్యాపిస్తున్న నేపథ్యంలో ఐసీఎంఆర్ అధ్యయనం నవంబర్, 2023లో వెలువడింది.
వ్యక్తుల జీవనశైలి, అలవాట్లు ఇతర అంశాలు గుండెపోటుకు కారణమవుతుందని, కోవిడ్ వ్యాక్సిన్ కాదని అధ్యయనం వెల్లడించింది. కోవిడ్ వ్యాక్సిన్ రెండు డోసులు ఆకస్మిక మరణాలను తగ్గించిందని అధ్యయనం పేర్కొంది. అయితే, కోవిడ్ 19 గుండె జబ్బులు, స్ట్రోక్ ప్రమాదాన్ని మాత్రం పెంచే అవకాశం ఉందని అధ్యయనం అంగీకరించింది. స్మోకింగ్, మద్యపానం, అతిగా మద్యం సేవించడం, మాదక ద్రవ్యాలు, తీవ్రమైన శారీరక శ్రమ వంటి జీవనశైలి స్ట్రోక్‌కి కారణమవుతున్నాయని అధ్యయనం తేల్చింది.
