కరోనా మహమ్మారి ఇంకా అతలాకుతలం చేస్తూనే ఉంది.. ఫస్ట్ వేవ్ లో భారీగా కేసులు నమోదు అయ్యి, మృతుల సంఖ్య కూడా పెద్ద సంఖ్యలోనే ఉండగా.. ఇక, సెండ్ వేవ్ గుబులు పుట్టించింది.. కోవిడ్ బారినపడి ఆస్పత్రికి వెళ్లినవారు తిరిగి వస్తారన్న గ్యారెంటీ లేని పరిస్థితి.. రోజుకో రికార్డు సంఖ్యలో కేసులు వెలుగు చూస్తే.. మృతుల సంఖ్య కూడా భారీగా నమోదవుతూ కలవరం పుట్టించింది.. ఇక, థర్డ్ వే హెచ్చరికలు భయపెడుతోంది.. ఇప్పటి వరకు ఆ మహమ్మారితో ఎక్కువ ఎఫెక్ట్ అయిన మహారాష్ట్రను ఇప్పుడు కొత్త భయాలు వెంటాడుతున్నాయి.. ఎందుకంటే.. మరో రెండు లేదా నాలుగు వారాల్లో కోవిడ్ థర్డ్ వేవ్ రాష్ట్రాన్ని తాకుతుందంటూ.. ఆ రాష్ట్ర టాస్క్ ఫోర్స్ హెచ్చరించింది.
అయితే, ఇప్పటికే ప్రచారంలో ఉన్న మాదిరిగా.. థర్డ్ వేవ్ చిన్నారులపై పెద్దగా ప్రభావం చూపబోదని టాస్క్ ఫోర్స్ అంచనా వేసింది.. మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రే అధ్యక్షతన జరిగిన సమావేశంలో దీనిపై చర్చించనట్టుగా సమాచారం.. ఇక, సెకండ్ వేవ్ కన్నా రెట్టింపు సంఖ్యలో థర్డ్ వేవ్‌లో కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యే అవకాశం ఉందని అంచనా వేసిన టాస్క్ ఫోర్స్ కమిటీ.. దాదాపు 8 లక్షల మందికి మహమ్మారి సోకే ప్రమాదం ఉందని పేర్కొంది.. ఆ కేసుల్లో 10 శాతం మేర కేసులు చిన్న పిల్లల్లో నమోదు అయ్యే అవకాశాలు ఉన్నాయని తెలిపింది. దీనికి ఉదాహరణగా బ్రిటన్‌లో వచ్చిన థర్డ్ వేవ్‌ను తీసుకుంది టాస్క్‌ఫోర్స్ కమిటీ.. బ్రిటన్‌లో సెకండ్ వేవ్ ముగిసిన నాలుగు వారాలకు థర్డ్ వేవ్ వచ్చిందని.. అదే తరహాలో మహారాష్ట్రకు కూడా ప్రమాదం పొంచిఉందని టాస్క్ ఫోర్స్ సభ్యుడు డాక్టర్ శషాంక్ జోషీ హెచ్చరించారు.