NTV Telugu Site icon

Covid 19: మళ్లీ మొదలైన టెన్షన్‌.. భారత్‌లో భారీగా పెరిగిన కరోనా కేసులు

భారత్‌లో కరోనా కేసుల్లో హెచ్చుతగ్గులు కొనసాగుతున్నాయి.. ఒమిక్రాన్‌లో కొత్త వేరియంట్లు వెలుగు చూసిన తర్వాత.. భారత్‌లో ఫోర్త్‌ వేవ్‌ హెచ్చరికలు వినిపిస్తున్నాయి.. మరోవైపు.. అలాంటిది ఏమీలేదని కూడా చెబుతున్నారు వైద్య నిపుణులు.. కానీ, క్రమంగా కరోనా కేసులు పెరగడం మాత్రం ఆందోళన కలిగిస్తోంది.. మొన్న రెండు వేలకు పైగా నమోదైన కేసులు.. నిన్న తగ్గాయి.. కానీ, ఇవాళ మళ్లీ ఆ సంఖ్య రెండు వేలను క్రాస్‌ చేసింది..

Read Also: PM Modi: రేపు ఎర్రకోట నుంచి నరేంద్ర మోడీ ప్రసంగం.. తొలి ప్రధాని ఆయనే..!

కేంద్ర వైద్యారోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్‌ ప్రకారం.. గత 24 గంటల్లో దేశంలో కొత్తగా 2,067 కరోనా పాజిటివ్ కేసులు, 40 మరణాలు నమోదుయ్యాయి.. నిన్నటితో పోలిస్తే 65 శాతం కోవిడ్ కొత్త కేసులు పెరిగాయి.. ప్రస్తుతం దేశంలో 12,340 యక్టీవ్ కేసులు ఉండగా.. ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్‌ కేసుల సంఖ్య 4,30,47,594కు, మరణాల సంఖ్య 5,22,006కు చేరింది.. ఇక, నిన్న కరోనా నుంచి 1,547 మంది కోలుకోవడంతో.. రికవరీ రేటు 98.76 శాతంగా ఉంది.. ఇప్పటి వరకు కరోనా నుంచి 4,25,13,248 మంది కోలుకున్నారు.