Site icon NTV Telugu

COVID-19: కరోనాతో భర్త మృతి.. అతని వీర్యంతో బిడ్డకు జన్మనిచ్చిన భార్య..

Ivf

Ivf

COVID-19: 2019 చైనాలో వెలుగులోకి వచ్చిన కోవిడ్ మహమ్మారి అనతికాలంలోనే ప్రపంచాన్ని మొత్తం వ్యాపించింది. చైనా, ఇండియా, అమెరికా, ఇటలీ వంటి దేశాల్లో లక్షల్లో మరణాలకు కారణమైంది. చాలా మంది కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. ముఖ్యంగా సెకండ్ వేవ్ సమయంలో మన దేశంలో మరణాల సంఖ్య ఎక్కువైంది. ఇప్పటికీ కూడా కరోనా వైరస్ తన రూపాన్ని మార్చుకుంటూ ప్రపంచంపై దాడి చేస్తూనే ఉంది.

Read Also: Devendra Fadnavis: “బీజేపీకి దేవుడు ఇచ్చిన గొప్ప వరం”.. రాహుల్ గాంధీపై దేవేంద్ర ఫడ్నవీస్ వ్యాఖ్యలు..

ఇదిలా ఉంటే భర్త కోవిడ్‌తో చనిపోయినప్పటికీ.. తన ద్వారా బిడ్డకు జన్మనివ్వాలనే భార్య కోరిక తీరింది. పశ్చిమ బెంగాల్ లోని భీర్‌భూమ్ జిల్లాలో కోవిడ్ తో మరణించిన భర్త వీర్యం ఆధారంగా ఓ మహిళ నడివయసులో మగబిడ్డకు జన్మనిచ్చింది. ఐవీఎఫ్ పద్ధతిలో జరిగిన ఈ ప్రక్రయిలో తల్లిబిడ్డలు క్షేమంగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు.

మురారై ప్రాంతానికి చెందిన సంగీత(48), అరుణ్ ప్రసాద్‌లకు 27 ఏళ్ల క్రితం వివాహం అయింది. అయితే సంగీతకు గర్భాశయ సమస్యలు ఉండటం వల్ల చాలా ఏళ్లుగా బిడ్డలు కలగలేదు. అయితే ఐవీఎఫ్ పద్ధతి ద్వారా బిడ్డకు జన్మనివ్వాలని దంపతులు భావించారు. రెండేళ్ల క్రితం భర్త అరుణ్ కుమార్ వీర్యాన్ని కోల్‌కతాలోని ఓ ల్యాబులో భద్రపరిచారు. ఇదిలా ఉంటే ఆ తర్వాత కోవిడ్ బారిన పడి సంగీత భర్త మరణించారు. చివరుకు ఆమెను అత్తామామలు కూడా పట్టించుకోలేదు. భర్త అరుణ్ కుమార్ నడిపే కిరాణా దుకాణమే ఆమెకు ఆధారమైంది. ఈ నేపథ్యంలో భర్తకు చెందిన భద్రపరిచిన వీర్యంతో బిడ్డకు జన్మనివ్వాలని భావించిన సంగీత.. అతని వీర్యాన్ని ఆమె అండంలోకి ప్రవేపెట్టడం ద్వారా గర్భం దాల్చింది. డిసెంబర్ 12న రాంపూర్‌హాట్ మెడికల్ కాలేజీలో సంగీత పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది.

Exit mobile version