COVID 19 CASES IN INDIA: దేశంలో కరోనా కేసుల సంఖ్య స్థిరంగా ఉంటోంది. ఇటీవల కాలంలో 16 వేలకు అటూ ఇటూగా రోజూవారీ కేసులు నమోదు అవుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో ఇండియాలో కొత్తగా 15,815 మంది కరోనా వ్యాధి బారినపడ్డారు. అయితే కరోనా మరణాల సంఖ్య మాత్రం పెరిగింది. తాజాగా గడిచిన 24 గంటల్లో 68 మంది వ్యాధి బారినపడి చనిపోయారు. అయితే రికవరీ అయ్యేవారి సంఖ్య పెరిగింది. గడిచిన ఒక రోజులో 20,018 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా డైలీ పాజిటివిటీ రేటు 4.36గా ఉంది. ప్రస్తుతం ఇండియాలో యాక్టివ్ కేసుల సంఖ్య 1,19,264గా ఉంది.
దేశంలో కోవిడ్ వ్యాప్తి మొదలైన రెండున్నరేళ్లలో ఇప్పటి వరకు 4,42,39,372 కరోనా కేసులు నమోదు అయ్యాయి. ఇందులో 4,35,73,094 మంది కోలుకోగా.. 5,26,996 మంది మరణించారు. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య మొత్తం కేసుల్లో 0.27గా ఉంది. రికవరీ రేటు 98.54 శాతంగా ఉండగా.. డెత్ రేట్ 1.19గా ఉంది. కరోనా వ్యాక్సినేషన్ విషయానికి వస్తే.. దేశంలో ఇప్పటి వరకు 207.71 కోట్ల డోసులను పంపిణీ చేశారు. నిన్న ఒక్క రోజే 24,43,064 మందికి కరోనా టీకాలు ఇచ్చారు. 3,62,802 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు చేశారు.
Read Also: Revanth Reddy Apology : కోమటిరెడ్డి డిమాండ్‌కు దిగొచ్చిన రేవంత్… బేషరతుగా క్షమాపణ..
ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ముఖ్యంగా జపాన్, దక్షిణ కొరియా దేశాల్లో కరోనా కేసులు విజృంభిస్తున్నాయి. జపాన్ దేశంలో కొత్తగా 2,24,929 కేసులు నమోదు కాగా.. 214 మంది మహమ్మారి బారినపడి మరణించారు. ఇక దక్షిణ కొరియాలో 1,28,671 కొత్త కేసులు నమోదు అయ్యాయి. 58 మంది మరణించారు. అమెరికాలో 85,116 కొత్త కేసులు నమోదు అయితే.. 335 మంది మరణించారు. జర్మనీ, రష్యాల్లో కూడా కేసుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా 59,39,36,453 కోవిడ్ కేసులు నమోదు కాగా.. 64,51,705 మంది మరణించారు.