NTV Telugu Site icon

Medha Patkar: మేధా పాట్కర్‌‌కు భారీ ఊరట.. జైలు శిక్ష సస్పెండ్

Medhapatkar

Medhapatkar

సామాజిక ఉద్యమకారిణి మేధా పాట్కర్‌కు ఢిల్లీ హైకోర్టులో భారీ ఊరట లభించింది. పరువు నష్టం దావా కేసులో ఆమెకు ఉపశమనం లభించింది. 5 నెలల జైలు శిక్షను న్యాయస్థానం సస్పెండ్ చేసి బెయిల్ మంజూరు చేసింది. దీంతో నర్మదా బచావో ఉద్యమకారిణికి బిగ్ రిలీఫ్ వచ్చినట్లైంది.

నర్మదా బచావో ఉద్యమ నేత మేధా పాట్కర్‌కు విధించిన ఐదు నెలల సాధారణ జైలు శిక్షను ఢిల్లీ కోర్టు సోమవారం సస్పెండ్ చేసింది. 23 ఏళ్ల క్రితం ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా గుజరాత్‌లోని ఎన్జీవోకు నేతృత్వం వహించిన పరువు నష్టం కేసులో మేధా పాట్కర్‌కు జూలైలో శిక్ష పడింది. దీంతో ఆమె శిక్ష రద్దు చేయాలని ధర్మాసనాన్ని ఆశ్రయించారు. తాజాగా కోర్టు.. శిక్షను సస్పెండ్ చేస్తూ.. 25,000 పూచీకత్తుపై పాట్కర్‌కు బెయిల్ మంజూరు చేసింది. దీనిపై సెప్టెంబర్ 4న సమాధానం ఇవ్వాలని కోరుతూ ఢిల్లీ ఎల్జీకి కోర్టు నోటీసులు జారీ చేసింది.