NTV Telugu Site icon

Delhi Riots Case: ఢిల్లీ అల్లర్లలో ఆప్ కీలక నేతపై మర్డర్ కేసు..

Delhi Riots

Delhi Riots

Delhi Riots Case: 2020 ఈశాన్య ఢిల్లీ అల్లర్ సమయంలో ఇంటిలిజెన్స్ బ్యూరో అధికారి అంకిత్ శర్మను అత్యంత దారుణంగా హత్య చేశారు. చాంద్ బాగ్ పులియా సమీపంలోని ఖజూరి ఖాస్ డ్రెయినేజ్ కాలువ నుంచి అంకిత్ శర్మ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆ సమయంలో ఈ హత్య సంచలనంగా మారింది. అంకిత్ శర్మ హత్యకు సంబంధించి ఆమ్ ఆద్మీ నేత తాహిర్ హుస్సెన్, మరో 10 మందిపై ఢిల్లీ కోర్టు గురువారం కిడ్నాప్, మర్డర్ అభియోగాలను మోపింది. అధికారి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు హుస్సేన్ తోపాటు 11 మంది నిందితులపై దయాల్ పూర్ పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసులను అదనపు సెషన్స్ జడ్డి పులస్త్య ప్రమాచల విచారించారు.

Read Also: NTR 30: ఎన్టీఆర్ సినిమాకి జక్కన వారసుడు ఇచ్చిన ఎలివేషన్ మాములుగా లేదు…

నిందితులు మహ్మద్ తాహిర్ హుస్సేన్, హసీన్, నజీమ్, కాసిం, సమీర్ ఖాన్, అనాస్, ఫిరోజ్, జావేద్, గుల్ఫామ్, షోయిబ్ ఆలం, ముంతాజిమ్‌ లపై సెక్షన్ 120 బి(నేరపూరిత కుట్ర), 302 (హత్య), 147 ( అల్లర్లు), 148 ( మారణాయుధాలతో అల్లర్లు పాల్పడటం), 153ఏ( మత కలహాలను రెచ్చగొట్టడం) వంటి అభియోగాలను మోపింది కోర్టు. అంకిత్ శర్మ మృతదేహాన్ని కాలువలో పారేస్తున్న సమయంలో ప్రత్యక్ష సాక్షి తీసిన వీడియోలో అనాస్, నజీమ్, కాసిమ్ మినహా మిగతా నిందితుల కాల్ వివరాలు బట్టి చూస్తే నిందితులంతా అక్కడే ఉన్నట్లు రుజువవుతోందని స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ మధుకర్ పాండే అన్నారు.

నిందితులంగా హిందువులను, వారి ఆస్తులను లక్ష్యగా చేసుకుని రెండు వర్గాల మద్య సామరస్యానికి విఘాతం కలిగించారని న్యాయమూర్తి అన్నారు. తాహిర్ హుస్సేన్ కూడా హిందువులను చంపేందుకు ప్రేరేపించారని న్యాయమూర్తి చెప్పారు. హిందువులపై దాడి చేసి చంపడం, వారి ఆస్తులపైకి పెట్రోల్ బాటిళ్లు, రాళ్లతో దాడులు చేయడమే వారి లక్ష్యం అని స్పష్టంగా తెలియజేస్తోందని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు.