Darshan Case: కర్ణాటకతో పాటు దేశవ్యాప్తంగా కన్నడ స్టార్ హీరో దర్శన్ కేసు సంచలనంగా మారింది. తన అభిమాని రేణుకాస్వామని దారుణంగా హింసించి, హత్య చేసిన కేసులో నిందితుడిగా ఉన్నాడు. ఈ హత్య కేసులో దర్శన్‌తో పాటు పవిత్ర గౌడ కీలక నిందితులుగా ఉన్నారు. ఇదిలా ఉంటే, రేణుకాస్వామి హత్య కేసులో దర్శన్, పవిత్ర గౌడ, మరో 15 మందిపై బెంగళూర్‌లోని 65వ సెషన్స్ కోర్టు సోమవారం హత్య, నేరపూరిత కుట్ర, కిడ్నాప్, చట్టవిరుద్ధమైన సమావేశం వంటి అభియోగాలు మోపింది. ఈ కేసు విచారణ నవంబర్ 10న ప్రారంభం అవుతుంది.
చిత్రదుర్గకు చెందిన రేణుకా స్వామి(35) దర్శన్ అభిమాని. అయితే, దర్శన్‌లో రిలేషన్‌లో ఉన్న పవిత్ర గౌడకు రేణుకాస్వామి అసభ్యకరమైన మేజేజ్‌లు పంపించడంతో, అతడిని కిడ్నాప్ చేసి, హింసించడంతో ఆయన మరణించారు. జూన్ 9, 2024న బెంగళూర్‌లోని ఒక నీటి కాలువ వద్ద రేణుకా స్వామి మృతదేహం కనిపించింది. ఈ కేసుపై సోమవారం కిక్కిరిసిన కోర్టు హాలులో అభియోగాలు మోపబడ్డాయి.
Read Also: Pakistan: పాక్ ఆర్మీ, ప్రభుత్వం మధ్య విభేదాలు.. ఆఫ్ఘాన్‌తో ఘర్షణ పెంచుతున్న ఆసిమ్ మునీర్..
న్యాయమూర్తి మొదటి నిందితురాలు పవిత్ర గౌడపై అభియోగాలు చదివి వినిపించారు. ‘‘రేణుకస్వామి ఆమెకు అశ్లీల సందేశాలు పంపారని, ఆ తర్వాత అతన్ని కిడ్నాప్ చేసి, బెంగళూరులోని ఒక షెడ్‌కు తీసుకెళ్లి దాడి చేశారని కోర్టు గమనించింది. అతన్ని చెప్పులు, చెక్క పలకతో కొట్టారు, ప్రాణాంతక గాయాలు చేశారు’’ అని న్యాయమూర్తి కోర్టులో చదివి వినిపించారు.
ఆరోపణల ప్రకారం..‘‘ పవిత్ర రేణుకాస్వామిని చెప్పుతో కొట్టగా, దర్శన్ అతడి ప్యాంట్ తొలగించి, అతడి ప్రైవేట్ భాగాలపై దాడి చేశాడు. ఇది అతడి మరణానికి దారి తీసింది. నిందితుల్లో కొంతమందిని నేరస్తులుగా చిత్రీకరించేందుకు వారిని డబ్బుతో ప్రలోభపెట్టారు’’ అని కోర్టు పేర్కొంది. 17 మంది నిందితులు నేరాన్ని అంగీకరించేందుకు నిరాకరించారు. దీంతో ఈ కేసుపై కోర్టు విచారణ మొదలుకానుంది. అభియోగాలు మోపిన తర్వాత దర్శన్, పవిత్ర గౌడ, మరో ఏడుగురు నిందితులను జైలుకు తరలించారు.
