Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Court Frames Charges Of Murder And Conspiracy Against Darshan Pavitra Gowda In Renukaswamy Case

Darshan Case: కన్నడ స్టార్ దర్శన్, పవిత్ర గౌడలపై హత్య, కుట్ర అభియోగాలు..

Published Date :November 3, 2025 , 5:41 pm
By BV Reddy
  • రేణుకా స్వామి కేసులో కీలక పరిణామం..
  • దర్శన్, పవిత్ర గౌడ మీద హత్య, కుట్ర అభియోగాలు..
  • నవంబర్ 10 నుంచి విచారణ ప్రారంభం..
Darshan Case: కన్నడ స్టార్ దర్శన్, పవిత్ర గౌడలపై హత్య, కుట్ర అభియోగాలు..
  • Follow Us :
  • google news
  • dailyhunt

Darshan Case: కర్ణాటకతో పాటు దేశవ్యాప్తంగా కన్నడ స్టార్ హీరో దర్శన్ కేసు సంచలనంగా మారింది. తన అభిమాని రేణుకాస్వామని దారుణంగా హింసించి, హత్య చేసిన కేసులో నిందితుడిగా ఉన్నాడు. ఈ హత్య కేసులో దర్శన్‌తో పాటు పవిత్ర గౌడ కీలక నిందితులుగా ఉన్నారు. ఇదిలా ఉంటే, రేణుకాస్వామి హత్య కేసులో దర్శన్, పవిత్ర గౌడ, మరో 15 మందిపై బెంగళూర్‌లోని 65వ సెషన్స్ కోర్టు సోమవారం హత్య, నేరపూరిత కుట్ర, కిడ్నాప్, చట్టవిరుద్ధమైన సమావేశం వంటి అభియోగాలు మోపింది. ఈ కేసు విచారణ నవంబర్ 10న ప్రారంభం అవుతుంది.

చిత్రదుర్గకు చెందిన రేణుకా స్వామి(35) దర్శన్ అభిమాని. అయితే, దర్శన్‌లో రిలేషన్‌లో ఉన్న పవిత్ర గౌడకు రేణుకాస్వామి అసభ్యకరమైన మేజేజ్‌లు పంపించడంతో, అతడిని కిడ్నాప్ చేసి, హింసించడంతో ఆయన మరణించారు. జూన్ 9, 2024న బెంగళూర్‌లోని ఒక నీటి కాలువ వద్ద రేణుకా స్వామి మృతదేహం కనిపించింది. ఈ కేసుపై సోమవారం కిక్కిరిసిన కోర్టు హాలులో అభియోగాలు మోపబడ్డాయి.

Read Also: Pakistan: పాక్ ఆర్మీ, ప్రభుత్వం మధ్య విభేదాలు.. ఆఫ్ఘాన్‌తో ఘర్షణ పెంచుతున్న ఆసిమ్ మునీర్..

న్యాయమూర్తి మొదటి నిందితురాలు పవిత్ర గౌడపై అభియోగాలు చదివి వినిపించారు. ‘‘రేణుకస్వామి ఆమెకు అశ్లీల సందేశాలు పంపారని, ఆ తర్వాత అతన్ని కిడ్నాప్ చేసి, బెంగళూరులోని ఒక షెడ్‌కు తీసుకెళ్లి దాడి చేశారని కోర్టు గమనించింది. అతన్ని చెప్పులు, చెక్క పలకతో కొట్టారు, ప్రాణాంతక గాయాలు చేశారు’’ అని న్యాయమూర్తి కోర్టులో చదివి వినిపించారు.

ఆరోపణల ప్రకారం..‘‘ పవిత్ర రేణుకాస్వామిని చెప్పుతో కొట్టగా, దర్శన్ అతడి ప్యాంట్ తొలగించి, అతడి ప్రైవేట్ భాగాలపై దాడి చేశాడు. ఇది అతడి మరణానికి దారి తీసింది. నిందితుల్లో కొంతమందిని నేరస్తులుగా చిత్రీకరించేందుకు వారిని డబ్బుతో ప్రలోభపెట్టారు’’ అని కోర్టు పేర్కొంది. 17 మంది నిందితులు నేరాన్ని అంగీకరించేందుకు నిరాకరించారు. దీంతో ఈ కేసుపై కోర్టు విచారణ మొదలుకానుంది. అభియోగాలు మోపిన తర్వాత దర్శన్, పవిత్ర గౌడ, మరో ఏడుగురు నిందితులను జైలుకు తరలించారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Actor Darshan
  • Bengaluru
  • Bengaluru court
  • Criminal Conspiracy
  • darshan

తాజావార్తలు

  • RCB vs SRH : ఆర్సీబీ రచ్చ..కోహ్లీ-పడిక్కల్ తుఫాన్‌తో హైదరాబాద్ చిత్తు

  • Off The Record : ఆ నేతలు మళ్లీ వైసీపీ వైపు చూస్తున్నారా..?

  • Iran Warning: భూతల దాడులు చేస్తే… అమెరికాకు అదే గతి.. ఇరాన్ పత్రిక వార్నింగ్

  • Viral Video: సీఎం బుగ్గపై ముద్దు పెట్టిన మహిళ.. నెట్టింట వీడియో వైరల్..

  • Story Board : ఇరాన్ ఉచ్చులో ట్రంప్..! యుద్ధం మొదలుపెట్టి.. ఎగ్జిట్ దొరకక అమెరికా అయోమయం

ట్రెండింగ్‌

  • Kitchen Tips : వేసవిలో పాలు త్వరగా పాడవుతున్నాయా..? అయితే ఈ సింపుల్ ట్రిక్ మిస్ కాకండి.!

  • కొత్త ఫీచర్లు, మెరుగైన 25కి పైగా అప్డేట్స్‌తో Hyundai Exter Facelift లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే..!

  • Jowar Dibbrotte Recipe: పైకి కరకరలాడుతూ, లోపల మెత్తగా ఉండే.. ఆరోగ్యకరమైన ‘జొన్న దిబ్బరొట్టె’ చేసేయండి ఇలా..!

  • స్పోర్టీ లుక్+బెటర్ గ్రిప్.. స్పోర్టీ రైడింగ్ కోసం కొత్త 2026 Royal Enfield Guerrilla 450 Apex వచ్చేసింది.. ధర ఎంతంటే.?

  • Hiccups Remedies : వెక్కిళ్లు ఆగడం లేదా.? ఈ చిట్కాలతో 30 సెకన్లలో చెక్ పెట్టండి.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions