Pregnancy termination: భర్త మరణంతో ఏడాదిగా మానసిక క్షోభను అనుభవిస్తున్న భార్య, తన 27 గర్భాన్ని వైద్యపరంగా రద్దు చేసుకునేందుకు ఢిల్లీ హైకోర్టు గురువారం అనుమతించింది. మానసిక పరిస్థితికి సంబంధించిన రిపోర్టును పిటిషనర్ కోర్టుకి సమర్పించింది. ఈ నివేదికను పరిగణలోకి తీసుకున్న జస్టిస్ సుబ్రమణియం ప్రసాద్ గర్భ విచ్ఛత్తికి అనుమతించారు. ‘‘పిటిషనర్ వివాహ స్థితిలో మార్పు ఉంది. ఆమె వితంతువు అయింది’’ అని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు.
ఎయిమ్స్ నివేదికతో.. భర్త మరణంతో భార్య తీవ్రమైన మానసిక క్షోభకు గురవుతున్నట్లు కోర్టు గుర్తించిందని ఆయన పేర్కొన్నారు. ఆమె పరిస్థితి కారణంగా మానసిక సమతుల్యతను కోల్పేయే అవకాశం ఉందని, దీంతో ఆమె తనకు తాను హాని చేసుకోవచ్చని అన్నారు. ‘‘ఇలాంటి పరిస్థితుల్లో గర్భాన్ని తీయించుకునేందుకు అనుమతివ్వాలని కోర్టును అభిప్రాయపడింది. గర్భాన్ని అలాగే కొనసాగించడం ఆమె మానసిక స్థిరత్వాన్ని దెబ్బతిస్తుందని కోర్టు చెప్పింది. ఆమె 24 వారాల గర్భదారణ గడువు దాటినప్పటికీ, మహిళ గర్భాన్ని తీయించుకునేందుకు అనుమతి ఉందని, ఎయిమ్స్ ప్రక్రియను నిర్వహించాలని’’ అని కోర్టు తన ఉత్తర్వుల్లో పేర్కొంది.
Read Also: Kim Jong Un: మిస్సైల్ లాంచర్ ఉత్పత్తి పెంచాలని కిమ్ ఆదేశం.. రష్యాకు ఇవ్వడానికేనా..?
తీర్పును చెప్పే సమయంలో ఎక్స్ వర్సెస్ ప్రిన్సిపల్ సెక్రటరీ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కేసులో సుప్రీంకోర్టు రూపొందించిన చట్టాన్ని ప్రస్తావించింది. ప్రతీ స్త్రీ కూడా తన జీవితాన్ని అంచనా వేసుకోవడం, భౌతిక పరిస్థితులలో వచ్చిన మార్పుల దృష్ట్యా , పునరుత్పత్తి హక్కు అనే వాస్తవాన్ని దృష్టిలో ఉంచుకుని ఉత్తమ చర్యను ఎంచుకునే ప్రత్యేక హక్కు ఉంటుందని పేర్కొంది. దీంట్లోనే సంతానోత్పత్తి నిరాకరించే హక్కు కూడా ఉంది. అయితే ప్రస్తుతం, ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా ఈ ఉత్తర్వులు జారీ చేయబడ్డాయని, దీనిని ఒక ఉదాహరణగా భావించరాదని హైకోర్టు స్పష్టం చేసింది. 23 ఏళ్ల యువతి 2023లో తన భర్తను కోల్పోయింది. అప్పటి నుంచి తీవ్ర మానసిక వ్యధను అనుభవిస్తోందని పిటిషనర్ తరుపు న్యాయవాది కోర్టుకు తెలిపారు.