ప్రస్తుతం ఉన్న సమాజంలో యువత హద్దులు మీరి ప్రవర్తిస్తుంది. ఎక్కడ పడితే అ సాంఘీక కార్యక్రమాలకు పాలుపడుతోంది. గతంలో ఓ జంట లిప్ట్ లో ముద్దులు పెట్టుకున్న వీడియో బయటకి రాగా.. అంతకు ముందు రోడ్డుపైనే ముద్దులు పెట్టుకున్నారు. మనం ఎక్కడ ఉన్నామనే సంగతే మరిచిపోతున్నారు. చుట్టూ నలుగురు చూస్తున్నారన్న ధ్యాస కూడా లేకుండా రెచ్చిపోతున్నారు. అయితే.. ఢిల్లీ ఇలాంటి ఘటనే ఒకటి చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అవుతుంది.
Read Also: Drinking Water Benfits: పురుషులు, స్త్రీలు ఎన్ని లీటర్ల నీరు తాగితే మంచిదో తెలుసా..
పూర్తి వివరాల్లోకి వెళితే.. ఢిల్లీలోని సాకేత్ ప్రాంతంలో కదులుతున్న కారు పైకప్పుపైకి ఎక్కి ముద్దు పెట్టుకుంటూ.. ప్రమాదకరమైన స్టంట్స్లు చేస్తున్నారు. దీంతో రోడ్డుపై వెళ్లే వారు .. వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టేశారు. అయితే.. ఒక వ్యక్తి కారు కదులుతుండగా.. కారు టాప్ ఎక్కాడు.. .. యువతి మాత్రం కారు డోర్ కు వేళాడుతూ.. ఒకరినొకరు ముద్దు పెట్టుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. వీడియో చూసిన నెటిజన్లు ఆ జంటపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రోడ్లపై ఇలాంటి పనులేంటని మండిపడుతూ.. వీరిపై వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.
Read Also:Walk After Meals: భోజనం చేసిన తర్వాత.. 10 నిమిషాలు నడవడం వల్ల ఏమవుతుందో తెలుసా..
వీడియో వైరల్ కావడంతో.. ఢిల్లీ పోలీసులు స్పందించారు. ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడిన వారిని గుర్తించి వారిపై కేసు నమోదు చేశారు. ఇలాంటి విన్యాసాలు చేసి ఇబ్బందులు పడవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించడం ద్వారా పౌరులు తమ ప్రాణాలకు, ఇతరుల ప్రాణాలకు ప్రమాదం కలిగించవద్దని అభ్యర్థించారు.