Shocking: మహారాష్ట్ర నాగ్‌పూర్ నగరంలో విషాదం నెలకొంది. 26వ మ్యారేజ్ యానివర్సరీ జరుపుకుంటున్న జంట, అదే రోజు ఆత్మహత్యకు పాల్పడింది. మంగళవారం తెల్లవారుజామున మార్టిన్ నగర్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. పెళ్లి దస్తులు ధరించిన దంపుతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. మరణించిన ఇద్దరిని జెరిల్ అలియాస్ టోనీ ఆస్కార్ మోన్‌క్రిప్ట్ (56), అతని భార్య అన్నీ (45)గా గుర్తించారు.
Read Also: Shraddha Srinath: ‘డాకు మహారాజ్’ దర్శకుడు ఏం చెప్తే అది చేయడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు
ఆత్మహత్యకు ముందు దంపతులు తమ మొబైల్ ఫోన్‌లో వీడియో రికార్డ్ చేసి, దానిని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి వారి బంధువులకు పంపినట్లు పోలీసులు తెలిపారు. జెరిల్ ముందుగా తన భార్య అన్నీ చనిపోవడానికి అనుమతించాడు. ఆమె శరీరంపై గుడ్డ కప్పి దానిపై పువ్వులు ఉంచాడని, ఆ తర్వాత వంట గదిలో జెరిల్ ఉరివేసుకుని మరణించినట్లు పోలీసులు తెలిపారు.
జెరిల్, అన్నీకి సంతానం లేదు. చనిపోతూ వీరు తమ బంధువుల పిల్లల్ని బాగా చూసుకోవాలని కుటుంబాన్ని కోరారు. రెండు సూసైడ్ నోట్స్‌ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తమ మరణాలకు ఎవరూ బాధ్యులు కాదని చెప్పారు. తమ ఆస్తి కుటుంబ సభ్యుల మధ్య పంపిణీ జరిగేలా చూడాలని కోరారు. వీరిద్దరిని కలిపి క్యాథలిక్ శ్మశానవాటికలో ఖననం చేశారు.