Shraddha Srinath: ‘డాకు మహారాజ్’ దర్శకుడు ఏం చెప్తే అది చేయడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నందమూరి అభిమానులతో పాటు, తెలుగు సినీ ప్రియులంతా ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం ‘డాకు మహారాజ్’. నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. బ్లాక్ బస్టర్ దర్శకుడు బాబీ కొల్లి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో శ్రద్ధా శ్రీనాథ్, ప్రగ్యా జైస్వాల్ కథానాయికలు. సంక్రాంతి కానుకగా జనవరి 12న ‘డాకు మహారాజ్’ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల కానుంది. ఈ క్రమంలో తాజాగా మీడియాతో ముచ్చటించిన కథానాయిక శ్రద్ధా శ్రీనాథ్, సినిమాకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
‘డాకు మహారాజ్’ సినిమాలో నటించడం ఎలా ఉంది?
నేను ఇప్పటివరకు కొన్ని విభిన్న సినిమాలు చేశాను. అయితే ఈ చిత్రం మాత్రం ఒక పూర్తి ప్యాకేజ్ లా ఉంటుంది. ఇలాంటి నేను ఇప్పటి వరకు చేయలేదు. కామెడీ, యాక్షన్, ఎమోషన్ అన్నీ ఉంటాయి. పైగా బాలకృష్ణ గారి సినిమా అంటే ఎక్కువ మంది ప్రేక్షకులకు నా ప్రతిభను చూపించే అవకాశం ఉంటుంది.
Also Read
- Ramayana: ఇలాంటి పాత్ర చేయడం పూర్వ జన్మ సుకృతం... 'రామాయణం' వేదికపై సాయి పల్లవి ఎమోషనల్
- Mowgli : రోషన్ కనకాల కోసం బరిలోకి జూనియర్ ఎన్టీఆర్
- Srinidhi Shetty: రాగ పాత్రతో మరో ఫేస్ చూపించబోతోంది శ్రీనిధి.. ‘తెలుసు కదా’పై ఆసక్తికర కామెంట్స్!
- Saif Ali Khan : నాపై దాడి కొందరికి నాటకమైంది.. అసహనం వ్యక్తం చేసిన సైఫ్
మీ పాత్ర ఎలా ఉండబోతుంది?
నా పాత్ర పేరు నందిని. చాలా సాఫ్ట్ గా ఉంటుంది. ఎంతో ఓపిక ఉంటుంది. అదే సమయంలో ఎప్పుడు మాట్లాడాలో స్పష్టంగా తెలుసు. నా పాత్రలో ఎంతో డెప్త్ ఉంటుంది. నటనకు కూడా ఎంతో ఆస్కారముంది.
బాలకృష్ణ గారి గురించి చెప్పాలంటే ఏమని చెప్తారు?
ఎన్నో ఏళ్ల నుంచి సినీ పరిశ్రమలో ఉన్నాను, నేనొక బిగ్ స్టార్ ని అనే అహం బాలకృష్ణ గారిలో కొంచెం కూడా ఉండదు. సెట్స్ లో అందరితో సరదాగా ఉంటారు. తనకంటే చిన్నా పెద్దా అని చూడకుండా దర్శకుడికి ఆయన ఎంతో గౌరవం ఇస్తారు. సినిమా కోసం దర్శకుడు ఏం చెప్తే అది చేయడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు.
‘డాకు మహారాజ్’ మీ సినీ కెరీర్ పై ఎలాంటి ప్రభావం చూపనుంది?
ఈ సినిమాపైనా, ఇందులో నేను పోషించిన నందిని పాత్ర పైనా ఎంతో నమ్మకంగా ఉన్నాను. నందిని పాత్రతో ప్రేక్షకులకు మరింత చేరువ కానున్నాను.
ఈ సినిమా ప్రయాణంలో మీకు ఛాలెంజింగ్ గా అనిపించింది ఏంటి?
నటిగా ఈ సినిమా నుంచి ఎంతో నేర్చుకున్నాను. ముఖ్యంగా ఇందులో డైలాగ్ లు కరెక్ట్ మెజర్ లో ఉంటాయి. డబ్బింగ్ చెప్పడానికి ఎక్కువ సమయం తీసుకున్నాను. ప్రతి డైలాగ్ మీద ఎంతో కేర్ తీసుకొని డబ్బింగ్ చెప్పించారు.
మీ పాత్ర పరంగా ‘జెర్సీ’, ‘డాకు మహారాజ్’ సినిమాల్లో ఏది బెస్ట్ అంటే ఏం చెప్తారు?
రెండూ వేటికవే ప్రత్యేకం. జెర్సీలో నేను పోషించిన సారా పాత్ర నా మనసుకి బాగా నచ్చిన పాత్ర. ప్రేక్షకులు కూడా ఎంతో ఆదరించారు. ఇప్పుడు డాకు మహారాజ్ లోని నందిని పాత్ర కూడా ప్రేక్షకులకు ఆ స్థాయిలో చేరువ అవుతుందనే నమ్మకం ఉంది.
సితార ఎంటర్టైన్మెంట్స్ గురించి?
సితార ఎంటర్టైన్మెంట్స్ నాకు జెర్సీ వంటి మెమరబుల్ ఫిల్మ్ ని ఇచ్చింది. నాపై నమ్మకం ఉంచి, ఇప్పుడు ‘డాకు మహారాజ్’లో మరో మంచి పాత్ర ఇవ్వడం ఎంతో ఆనందంగా ఉంది. సితార ఎన్నో మంచి మంచి సినిమాలను నిర్మిస్తూ ఉంటుంది. అలాంటి బ్యానర్ లో సినిమా చేయడం ఎప్పుడూ గౌరవంగానే భావిస్తాను.
దర్శకుడు బాబీ గారి గురించి?
బాబీ గారు ప్రతిభగల దర్శకుడు. సినిమా పట్ల ఆయనకు ఎంతో పాషన్ ఉంది. అలాగే, బాబీ గారిలో మంచి నటుడు కూడా ఉన్నాడు. అద్భుతమైన సూచనలు ఇస్తూ, నటీనటుల నుంచి మంచి నటనను రాబట్టుకుంటారు.
మీకు ఎలాంటి సినిమాలు, పాత్రలు చేయాలని ఉంది?
అన్ని రకాల సినిమాలు చేయాలని ఉంది. నిజ జీవితానికి దగ్గరగా ఉండే పాత్రలు పోషించడానికి ఎక్కువ ఇష్టపడతాను.
తాజావార్తలు
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
-
Chanchalguda Jail : చంచల్‌గూడ జైలు సూపరింటెండెంట్‌పై ఆరోపణలు.. జైళ్ల శాఖ క్లారిటీ
-
Thackeray Brothers: ఠాక్రే బ్రదర్స్ ‘విరాట్ గర్జన’.. ఎన్నికల సంఘంపై విపక్షాల ఉమ్మడి పోరాటం!
-
Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
-
LPG Subsidy: సిలిండర్ బుక్ చేసుకునేవారికి శుభవార్త.. రూ.300 సబ్సిడీకి కేంద్రం గ్రీన్ సిగ్నల్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!