Site icon NTV Telugu

Covid Cases: భారత్‌ను బెంబేలెత్తిస్తున్న కరోనా.. కేరళ, ముంబై, ఢిల్లీలో పెరిగిన కేసులు

Covidcases

Covidcases

భారత్‌లో మరోసారి కరోనా విజృంభిస్తోంది. గత కొద్ది రోజులుగా కేసులు అమాంతంగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం కేరళ, ముంబై, ఢిల్లీలో కోవిడ్ కేసులు భయాందోళన కలిగిస్తున్నాయి. దీంతో ఆస్పత్రుల్లో పడకలు సిద్ధం చేయాలని.. అలాగే ఆక్సిజన్ సిద్ధంగా ఉంచాలని ఆదేశాలు వెళ్లాయి. ఢిల్లీ, మహారాష్ట్ర, కేరళ, తమిళనాడు, కర్ణాటకలో ఈనెలలోనే కేసులు పెరిగాయి. చిన్నపాటి కేసులే అయినా అప్రమత్తంగా ఉండాలంటూ ఆదేశాలు వెళ్లాయి. ఇప్పటి వరకు ఎలాంటి మరణాలు సంభవించలేదు.

ఇది కూడా చదవండి: Abhishek Sharma: అభిషేక్ భారీ సిక్స్‌కు బద్దలైన కారు అద్దం

జేఎన్ 1 వేరియంట్ కారణంగానే దక్షిణాసియాలో కోవిడ్ కేసుల పెరుగుదలకు కారణంగా తెలుస్తోంది. ఢిల్లీలో ప్రస్తుతం 23 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. దేశంలో అత్యధికంగా కేరళలో 273 కేసులు నమోదైనట్లు నివేదికలు అందుతున్నాయి. దాదాపు చాలా రోజుల నుంచి కోవిడ్ కేసులు లేవు. అలాంటిది అకస్మాత్తుగా ఉన్నట్టుండి కేసులు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. పట్టణాల్లో నెమ్మది నెమ్మదిగా వైరస్ విజృంభిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఢిల్లీ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాలతో పాటు కేంద్రపాలిత ఆస్పత్రులను అప్రమత్తం చేశారు.

ఇది కూడా చదవండి: Theaters Shut Down: జూన్‌ 1 నుంచి థియేటర్ల బంద్‌..! ఫిల్మ్‌ ఛాంబర్‌ కీలక ప్రకటన..

ఇదిలా ఉంటే ఇప్పటి వరకు ఎక్కడా కూడా మరణాలు సంభవించలేదు. తేలికపాటి వైరస్ కారణంగానే మరణాలు లేవని వైద్య బృందం అభిప్రాయపడుతోంది. ఇదిలా ఉంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా దీన్ని ఆందోళన కలిగించే వేరియంట్‌గా పేర్కొనలేదు. వైరస్ సోకిన వారు నాలుగు రోజుల్లో కోలుకుంటున్నారు. కొన్ని సాధారణ లక్షణాలు జ్వరం, ముక్కు కారటం, గొంతు నొప్పి, తలనొప్పి, అలసట సంభవిస్తున్నాయి. ఎలాంటి భయాందోళనలు అవసరం లేదని ఢిల్లీ ఆరోగ్య మంత్రి పంకజ్ సింగ్ అన్నారు.

Exit mobile version