NTV Telugu Site icon

Corona Update: భయపెడుతున్న ఫోర్త్ వేవ్… 24 గంటల్లో 2710 కరోనా కేసులు

Corona

Corona

దేశంలో గత కొన్ని రోజుల నుంచి క్రమంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో ఇండియాలో కొత్తగా 2710 కేసులు నమోదు అయ్యాయి. ఇది గురువారంతో పోలిస్తే స్వల్పంగా పెరిగాయి. నిన్న ఒక్క రోజే మహమ్మారి బారిన పడి 14 మంది మరణించారు. ఇదిలా ఉంటే 24 గంటల్లో 2296 మంది కరోనాను జయించారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో మొత్తం 15,814 యాక్టివ్ కేసులు మాత్రమే ఉన్నాయి.

కరోనా ప్రారంభం అయినప్పటి నుంచి దేశంలో ఇప్పటి వరకు 4,31,47,530 మంది కరోనా మహమ్మారి బారినపడ్డారు. అయితే వీరిలో ఇప్పటి వరకు 5,24,539 మరణించగా… 4,26,07,177 మంది కరోనా నుంచి బయటపడ్డారు. ప్రస్తుతం దేశంలో రికవరీ రేటు 98.75 శాతంగా ఉందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రస్తుతం మొత్తం ఇన్ఫెక్షన్లలో యాక్టివ్ కేసులు 0.04 శాతం మాత్రమే ఉన్నాయి. గురువారంతో పోలిస్తే యాక్టివ్ కేస్ లోడ్ 400 వరకు పెరిగింది. రోజూవారీ పాజిటివిటీ రేటు 0.58గా ఉంది. ప్రస్తుతం దేశంలో 192.97 వ్యాక్సిన్ డోసులను అర్హులైన వారికి అందించారు.

ఇదిలా ఉంటే గ్లోబల్ కరోనా వైరస్ గణాంకాలను పరిశీలస్తే ప్రపంచ వ్యాప్తంగా 53,01,57,770కు చేరింది. మరణాల సంఖ్య 63,07,663గా ఉంది. కరోనా కేసుల విషయంలో 8,38,37,114 అమెరికా మొదటిస్థానంలో ఉండగా… రెండో స్థానంలో భారత్ ఉంది. తరువాతి స్థానాల్లో బ్రెజిల్ (30,880,512), ఫ్రాన్స్ (29,626,9923), జర్మనీ (26,200,663), యూకే (22,458,340), దక్షిణ కొరియా (18,053,287), రష్యా (18,043,539), It3aly319, 15,068,094), స్పెయిన్ (12,280,345) మరియు వియత్నాం (10,714,008) దేశాలు ఉన్నాయి.