NTV Telugu Site icon

క‌రోనా సెకండ్ వేవ్.. ఇప్ప‌టి వ‌ర‌కు 719 మంది వైద్యులు మృతి

Corona

కంటికి క‌నిపించ‌ని క‌రోనా మ‌హ‌మ్మారితో ముందుంటి పోరాటం చేస్తున్నారు.. వైద్యులు, వైద్య సిబ్బంది.. ఇదే స‌మ‌యంలో.. చాలా మంది కోవిడ్ బారిన‌ప‌డుతూనే ఉన్నారు.. ఇక‌, సెకండ్ వేవ్ వైద్య రంగంపై తీవ్ర ప్ర‌భావాన్ని చూపింది.. సెకండ్‌ వేవ్‌లో ఇప్పటి వరకు కోవిడ్ బారిన‌ప‌డి ఏకంగా 719 మంది వైద్యులు ప్రాణాలు కోల్పోయారు.. ఈ విష‌యాన్ని ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ (ఐఎంఏ) ప్ర‌క‌టించింది.. ఇక‌, మృతిచెందిన వైద్యుల సంఖ్య రాష్ట్రాల‌వారీగా చూస్తే.. అత్యధికంగా బీహార్‌లో 111 మంది వైద్యులు, ఢిల్లీలో 109, ఉత్తరప్రదేశ్‌లో 79 మంది, పశ్చిమ బెంగాల్‌లో 63 మంది, రాజస్థాన్‌లో 43 మంది, జార్ఖండ్‌లో 39 మంది, గుజరాత్‌లో 37, తెలంగాణలో 36 మంది, ఏపీలో 35 మంది, తమిళనాడులో 32 మంది వైద్యులు కేవ‌లం సెకండ్ వేవ్‌లోనే ప్రాణాలు కోల్పోయార‌ని ఐఎంఏ ఓ ప్ర‌క‌ట‌న‌లో పేర్కొంది.. ఇక‌, క‌రోనా ఫ‌స్ట్ వేవ్‌లో 748 మంది వైద్యులు ప్రాణాలు కోల్పోగా.. ఇప్ప‌టి వ‌ర‌కు కోవిడ్ బారిన‌ప‌డి మృతిచెందిన వైద్యుల సంఖ్య 1,467కు చేరింది.