Site icon NTV Telugu

కాలుష్య ప్రాంతాలకు దూరంగా ఉండండి: రణదీప్‌ గులేరియా

ఇప్పటికే కరోనాతో ప్రజలు అల్లాలాడిపోతుంటే మరో వైపు కాలుష్యంతో ఇతర సమస్యలు వచ్చిపడుతున్నాయి. తాజాగా దీనిపై ఎయిమ్స్‌ డైరెక్టర్‌ రణదీప్‌ గులేరియా మాట్లాడుతూ.. వాయు కాలుష్యంతో కరోనా తీవ్రత అధికమవుతుందన్నారు. ఆస్తమా రోగులకు శ్వాసకోశ సమ స్యలు ఎక్కువ అయ్యే అవకాశం ఉందన్నారు. కాలుష్యం అధికంగా ఉన్న గాలిలో వైరస్‌ ఎక్కువ కాలం బతికి ఉంటుం దన్నారు. దీని వల్ల కరోనా మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ప్రజలను ఆయన హెచ్చరించారు.

ప్రజలు కాలుష్యం అధికంగా ఉన్న ప్రాంతాలకు చాలా దూరంగా ఉండాలని తెలిపారు. ఇప్పటికే దీపావళి పర్వదినం సందర్భంగా పలు నగరాల్లో కాలుష్యం అధికంగా పెరిగిందన్నారు. కరోనా అంతం కాలేదని అది రూపం మార్చుకుంటుందని ప్రజలు అప్రమత్తంగా వ్యవహరించకుంటే భారీ నష్టం తప్పదన్నారు. ఇప్పటికైనా ప్రజలు కరోనా జాగ్రత్తలు పాటించాలని రణదీప్ గులేరియా పేర్కొన్నారు.

Exit mobile version