ఇప్పటికే కరోనాతో ప్రజలు అల్లాలాడిపోతుంటే మరో వైపు కాలుష్యంతో ఇతర సమస్యలు వచ్చిపడుతున్నాయి. తాజాగా దీనిపై ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా మాట్లాడుతూ.. వాయు కాలుష్యంతో కరోనా తీవ్రత అధికమవుతుందన్నారు. ఆస్తమా రోగులకు శ్వాసకోశ సమ స్యలు ఎక్కువ అయ్యే అవకాశం ఉందన్నారు. కాలుష్యం అధికంగా ఉన్న గాలిలో వైరస్ ఎక్కువ కాలం బతికి ఉంటుం దన్నారు. దీని వల్ల కరోనా మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ప్రజలను ఆయన హెచ్చరించారు. ప్రజలు కాలుష్యం…
ప్రపంచ దేశాలను ఇప్పటికే వణికిస్తూనే ఉంది కరోనా మహమ్మారి.. భారత్‌లో కరోనా ఫస్ట్ వేవ్ కంటే.. సెకండ్ వేవ్ సమయంలో పెద్ద సంఖ్యలో కేసులు వెలుగు చూడడమే కాదు.. మృతుల సంఖ్య కూడా భారీగా పెరిగిపోయింది.. ఇక, ఇప్పటికీ పూర్తిస్థాయిలో కోవిడ్ కేసులు అదుపులోకి వచ్చిందేలేదు.. మరోవైపు థర్డ్ వేవ్ హెచ్చరికలు కూడా ఉన్నాయి.. ఈ తరుణంలో కోవిడ్ పరిస్థితులపై తాజాగా హెచ్చరించింది ఎయిమ్స్.. వచ్చే 6 నుంచి 8 వారాల పాటు ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు…