Site icon NTV Telugu

Corona Updates : దేశంలో మళ్లీ పెరుగుతున్న కేసులు.. కొత్తగా..

యావత్త ప్రపంచాన్ని గత రెండు సంవత్సరాలుగా పట్టి పీడిస్తున్న కరోనా మహామ్మారి మరోసారి విజృంభిస్తోంది. ఒమిక్రాన్‌ వేరియంట్‌ వ్యాప్తితో దేశంలో థర్డ్ వేవ్ రానేవచ్చింది. అయితే థర్డ్‌వేవ్‌పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కట్టదిట్టమైన నిబంధనలు అమలు చేస్తూ.. థర్డ్‌వేవ్‌ను ఆదిలోనే అంతం చేశారు. అయితే ఇప్పుడు ఒమిక్రాన్ వేరియంట్‌లోని మ్యుటేషన్ ప్రజల్లో వ్యాప్తిచెందుతోంది. కరోనా పుట్టినిళ్లు చైనాలో కూడా గత కొన్ని రోజుల నుంచి కరోనా కేసులు భారీగా నమోదువుతున్నాయి. దీంతో చైనాలోనే అతిపెద్ద సిటీగా పేరుగాంచిన శాంఘై నగరంలో లాక్‌డౌన్ అమలు చేస్తున్నారు. అయితే భారత్‌లో కూడా క్రమక్రమంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి.

గ‌డిచిన 24 గంట‌ల్లో కొత్తగా 2,483 పాజిటివ్ కేసులు న‌మోదైన‌ట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్ల‌డించింది. ఆదివారంతో పోల్చితే 2.2 శాతం కేసులు త‌క్కువ‌గా న‌మోదు అయ్యాయి. ఆదివారం కొత్త‌గా 2,541 మందికి క‌రోనా నిర్ధార‌ణ అయిన‌ట్లు అధికారులు తెలిపిన విష‌యం తెలిసిందే. అయితే ఢిల్లీతో పాటు 12 రాష్ట్రాల్లో కొత్త కేసులు క్ర‌మంగా పెరుగుతున్నాయి. క‌రోనా నుంచి 1,970 మంది బాధితులు కోలుకున్నారు. దేశంలో ప్ర‌స్తుతం 15,636 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. దేశ వ్యాప్తంగా ఇప్ప‌టి వ‌ర‌కు 187.95 కోట్ల క‌రోనా టీకా డోసుల‌ను పంపిణీ చేశారు.

Exit mobile version