NTV Telugu Site icon

Prajwal Revanna: సె*క్స్ వీడియోలు షూట్ చేసిన ప్రజ్వల్ రేవణ్ణ ఫోన్ కోసం సిట్ దర్యాప్తు..

Prajwal Revanna

Prajwal Revanna

Prajwal Revanna: ప్రజ్వల్ రేవణ్ణ సెక్స్ టేపుల కేసులో విచారణను వేగవంతం చేసింది సిట్. నిన్న జర్మనీ నుంచి బెంగళూర్ వచ్చిన ప్రజ్వల్‌ని ఎయిర్ పోర్టులోనే పోలీసులు అరెస్ట్ చేశారు. కోర్టు అతడికి 6 రోజుల సిట్ కస్టడీకి అప్పగించింది. ఈ కేసులో అత్యంత కీలమైన మొబైల్ ఫోన్ కోసం సవాలుగా మారింది. ఈ ఫోన్ ద్వారా మాజీ జేడీఎస్ నేత, ఎంపీ అయిన ప్రజ్వల్ మహిళలతో శృంగార వీడియోలను చిత్రీకరించాడని విచారణ అధికారులు భావిస్తున్నారు. మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న స్పష్టమైన వీడియోలను రికార్డ్ చేయడానికి ప్రాథమికంగా ఫోన్ వినియోగించినట్లు తెలుస్తోంది.

దీనిపై ప్రజ్వల్ రేవణ్ణను ప్రశ్నించగా.. ఏడాది క్రితం తన మొబైల్ ఫోన్ పోగొట్టుకున్నానని తెలిపినట్లు సమాచారం. తాను ఫోన్ పోగొట్టుకున్నప్పుడు స్థానిక పోలీస్ స్టేషన్‌లో కూడా ఫిర్యాదు చేశానని, తాను కేఎస్పీ యాప్ ద్వారా కూడా ఫిర్యాదు చేశానని చెప్పారు. ప్రస్తుతం ఈ ఫోన్ కీలకంగా మారడంతో, ప్రజ్వల్ రేవణ్ణ ఫిర్యాదుపై హోలెనరసిహూర్ పోలీస్ స్టేషన్‌ని సిట్ సంప్రదించింది. . ఫోన్ పోగొట్టుకున్న కేసులో నాన్ కాగ్నిజబుల్ రిపోర్ట్ (ఎన్‌సీఆర్) నమోదు చేసినట్లు పోలీసులు సిట్‌కు తెలిపారు. అయితే, పోలీసులు విస్తృతంగా సోదాలు చేసినప్పటికీ, మొబైల్ ఫోన్‌ను కనుగొనలేకపోయారు.

Read Also: Suspect Terrorist : భారత్ హెచ్చరిక.. ఐసిస్ హ్యాండ్లర్‌ను అరెస్ట్ చేసిన శ్రీలంక పోలీసులు

సిట్ మొబైల్ ఫోన్ IMEI నంబర్‌ను పొందింది, దానిని గుర్తించేందుకు విచారణ వేగవంతం చేసింది. వీడియోలను రికార్డ్ చేయడానికి ప్రాథమికంగా ఉపయోగించిన పరికరం ధ్వంసమైందని, అధికారులు దానిని గుర్తించడంలో విఫలమైతే, ప్రజ్వల్‌పై ‘‘సాక్ష్యాలు ట్యాంపరింగ్’’ చేశాడనే అదనపు అభియోగాలు మోపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఏప్రిల్ నెలలో ప్రజ్వల్ రేవణ్ణ సెక్స్ టేపుల కుంభకోణం వెలుగులోకి వచ్చింది. రేవణ్ణ కుటుంబానికి పట్టున్న హసన్ జిల్లాలో పాటు కర్ణాటకలోని ఇతర ప్రాంతాల్లో కూడా ఆయనకు సంబంధించినవిగా చెప్పబడుతున్న వీడియోలు వైరల్ అయ్యాయి. దీంతో పాటు రేవణ్ణ ఇంట్లో పనిచేస్తున్న 47 ఏళ్ల మహిళ ప్రజ్వల్‌తో పాటు ఆయన తండ్రి హెచ్‌డీ రేవణ్ణపై అత్యాచారం, లైంగిక వేధింపలు కేసు పెట్టింది. ఆ తర్వాత పరిణామాల్లో ప్రజ్వల్ దేశాన్ని వదిలి జర్మనీ వెళ్లిపోయాడు. ఈ నేపథ్యంలో అతడిని రప్పించేందుకు సిట్ లుక్ అవుట్ నోటీసులు జారీ చేసింది. దీంతో పాటు అతని దౌత్య పాస్‌పోర్టు రద్దుకు కేంద్రం సిద్ధమవుతున్న తర్వాత ఆయన బెంగళూర్ తిరిగి వచ్చాడు.